Breaking News

ఈ సినిమాలో వచ్చే ఎమోషన్‌ ఏ తెలుగు సినిమాలోనూ చూడలేదు: అవసరాల

Published on Fri, 03/17/2023 - 09:02

నాగశౌర్య, మాళవికా నాయర్‌ జంటగా అవసరాల శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. టీజీ విశ్వప్రసాద్, దాసరి పద్మజ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌లో నాగశౌర్య మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా కోసం మేం చాలా కష్టపడ్డాం. మా కష్టం థియేటర్స్‌లో తెలుస్తుంది. నా కెరీర్‌లో ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ సినిమాల గురించి ఎలా చెప్పుకున్నానో ‘ఫలానా..’ సినిమా గురించి అంతే బాగా చెప్పుకుంటాను. ఈ సినిమా విజయం పట్ల నమ్మకంగా ఉన్నాం’’ అన్నారు.

‘‘ఈ చిత్రంలోని పాత్రలు నిజజీవితంలో చూసినట్లుగా ఉంటాయి. ఎమోషనల్‌ మూవీ ఇది. నటనపై ఆధారపడ్డ సినిమా కాబట్టే సింక్‌ సౌండ్‌ ఉండాలని నిర్ణయించుకున్నాను. ఈ సినిమాలోని సంజయ్‌ పాత్రకు నాగశౌర్య బాగా సరిపోయాడు. ఏడు చాప్టర్లు ఉండే ఈ సినిమాలోని నాలుగో చాప్టర్‌ నాకు చాలా ఇష్టం. ఇంటర్వెల్‌కి ముందు వచ్చే ఈ చాప్టర్‌లో వచ్చే ఎమోషన్‌ ఇంతవరకు నేను తెలుగు సినిమాల్లో చూడలేదనేది నా అభిప్రాయం’’ అన్నారు అవసరాల శ్రీనివాస్‌. ‘‘నాగశౌర్య, మాళవికల సహజ నటన కోసం ఈ సినిమా చూడొచ్చు’’ అన్నారు చిత్ర సహనిర్మాత వివేక్‌ కూచిభొట్ల.‘‘ఇంత మంచి సినిమాలో మమ్మల్ని భాగం చేసిన విశ్వప్రసాద్, వివేక్‌ కూచిభొట్లగారికి థ్యాంక్స్‌’’ అన్నారు దాసరి ప్రసాద్‌.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)