Breaking News

ప్లేటు తిప్పేసిన మణికంఠ.. ఎలిమినేషన్ తర్వాత కూడా

Published on Mon, 10/21/2024 - 07:48

బిగ్‌బాస్ 8లో విచిత్రమైన క్యారెక్టర్ అంటే మణికంఠనే. ఎప్పుడేం చేస్తాడో, ఎలా ప్రవర్తిస్తాడనేది అస్సలు అర్థం కాదు. వచ్చిన కొత్తలో భార్యబిడ్డలు కావాలి అని నానా హంగామా చేశాడు.  ఇప్పుడవన్నీ పక్కనబెట్టి సరిగా ఆడుతున్నాడేమో అనుకుంటే.. ఆరోగ్యం బాగోలేదని చెప్పి తనకు తానుగా బయటకొచ్చేశాడు. తీరా ఇప్పుడేమో మాటలు మార్చేస్తున్నాడు. బిగ్‌బాస్ బజ్ ఇంటర్వ్యూలో ఏ ప్రశ్నకు తిన్నగా సమాధానం చెప్పకుండా అర్జున్‪‌కే ఝలక్స్ ఇచ్చాడు.

గెలవాలనే ఆలోచనతో వచ్చిన మీరు.. కనీసం చీఫ్ అవ్వకుండానే బయటకు ఎందుకొచ్చారు? అని హోస్ట్ అర్జున్ అడగ్గా.. విన్నర్ అవ్వాలనే ఆలోచనతో అయితే నేను రాలేదని అన్నాడు. దీంతో అర్జున్ నోరెళ్లబెట్టాడు. అదెంత పెద్ద కంటెంటో తెలుసా అని ఆశ్చర్యపోయాడు. 'నా పెళ్లాం బిడ్డ నాకు కావాలి. నా రెస్పెక్ట్ నాకు కావాలి' అని మణికంఠలా ప్రవర్తించి అర్జున్ చూపించాడు. అప్పటివరకు నవ్వు ముఖంతో ఉన్న మణికంఠ కాస్త దెబ్బకు డీలా పడిపోయాడు.

(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 'కేరింత' సినిమా హీరో)

గోరంత దాన్ని కొండంత చేస్తావ్ అని హౌస్‌మేట్స్ అభిప్రాయం.. దీనిపై ఏమంటావ్ అని అడగ్గా.. నేను ఆలోచించే విధానం అలా ఉంటుంది కాబట్టి రియాక్ట్ అయ్యే విధానం కూడా అలానే ఉంటుందని మణికంఠ చెప్పాడు. సరే ఇవన్నీ కాదు గానీ హౌస్‌లో నువ్వు చేసిన పాజిటివ్ విషయం ఒకటి చెప్పు అని అర్జున్ అడగ్గా.. నేను నాలా ఉండటమే పాజిటివ్ అని మణికంఠ తలతిక్క సమాధానం చెప్పాడు.

నీకు సాయం చేసిన వాళ్లనే నువ్వు వెన్నపోటు పొడిచావ్ అంటే ఏమంటావ్? అని అడగ్గా.. ఇదైతే అస్సలు అంగీకరించను అని మణికంఠ ససేమిరా అన్నాడు. హౌస్‌లో డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయని మీకు అనిపించిందా? అంటే తడముకోకుండా నిఖిల్ పేరు చెప్పాడు. ఇక పృథ్వీ-విష్ణుప్రియ మధ్య రెండు వైపుల నుంచి ప్రేమ చిగురిస్తోందని చెప్పి షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు. 'ఇది మాకు తెలీదయ్యో' అని హోస్ట్ అర్జున్ షాకింగ్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌ 8: నాగమణికంఠ పారితోషికం ఎంతంటే?)

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)