Breaking News

నాగచైతన్య తండేల్ మూవీ.. సాయిపల్లవిలా అదరగొట్టిన దేవీశ్రీ ప్రసాద్

Published on Thu, 02/06/2025 - 19:23

అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. శోభితతో పెళ్లి తర్వాత వస్తోన్న తొలి చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చందు మొండేటి డైరెక్షన్‌లో వస్తోన్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన తండేల్ మూవీ ట్రైలర్‌, సాంగ్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మత్స్యకార బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కించిన ఈ చిత్రంలో నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్‌గా నటించింది.

అయితే ఈ మూవీ రిలీజ్‌కు ముందు దర్శకుడు చందు, మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ తండేల్‌ను వీక్షించారు. సినిమా ఫైనల్ కాపీ చూసిన దేవీశ్రీ, చందు డ్యాన్స్‌తో అదరగొట్టారు. హైలెస్సా హైలెస్సా అంటూ సాంగే పాటకు స్టెప్పులు వేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తండేల్ సినిమా ఫర్‌ఫెక్ట్‌గా రావడంతో సంతోషంతో డ్యాన్స్ చేశారు. దీంతో తండేల్ సూపర్ హిట్ కావడం ఖాయమని ఫ్యాన్స్‌తో పాటు మేకర్స్ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు.

(ఇది చదవండి: తండేల్ మూవీ.. నాగచైతన్య జర్నీ చూశారా?)

మత్స్యకార బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న ఈ చిత్రాన్ని రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కించారు. గుజరాత్‌లో చేపల వేటకు వెళ్లిన కొందరు శ్రీకాకుళం మత్స్యకారులను పాకిస్తాన్ కోస్ట్ గార్డ్స్‌ చేతికి చిక్కడం.. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో తండేల్ మూవీని రూపొందించారు. నిజజీవితంలో జరిగిన కథ కావడంతో తండేల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతే కాకుండా శోభితతో నాగచైతన్య పెళ్లి తర్వాత వస్తోన్న మొదటి చిత్రం కావడం మరో విశేషం. ఏదేమైనా చైతూ ఖాతాలో హిట్టా? సూపర్ హిట్టా? అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. 
 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)