Breaking News

తప్పెవరిదైనా సారీ చెప్పేదొకరే.. భార్య కోసం వంట చేసిపెడ్తున్న చై!?

Published on Fri, 03/21/2025 - 16:18

టాలీవుడ్‌ జంట నాగచైతన్య (Naga Chaitanya)- శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) తొలిసారి మనసు విప్పి మాట్లాడారు. ప్రముఖ మ్యాగజైన్‌ వోగ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇన్‌స్టాగ్రామ్‌లోనే తమ ప్రేమ మొదలైందని వెల్లడించారు. తాజాగా ఎవరు సారీ చెప్తారు? పెళ్లి తర్వాత వంట ఎవరు చేసిపెడ్తున్నారు? వంటి విషయాలను అన్నింటినీ వోగ్‌ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

సారీ ఎవరు చెప్తారు?
తప్పు ఎవరిదైనా సరే ఎవరు సారీ చెప్తారు? అన్న ప్రశ్నకు శోభిత తనే క్షమాపణలు చెప్తానంది. అది విని ఆశ్చర్యపోయిన చై.. నువ్వసలు సారీలు, థాంక్స్‌ నమ్మవు కదా అన్నాడు. అందుకామె ప్రేమలో క్షమాపణలు, కృతజ్ఞతలకు చోటు లేదు అని పేర్కొంది. దాంతో నవ్వేసిన చైతూ.. తనే సారీ చెప్తానని ఒప్పుకుంటూనే మొదటగా ప్రేమను వ్యక్తపరిచింది కూడా తానే అని ఒప్పుకున్నాడు. 

నీకది లేదులే.. చై సెటైర్లు
ఎవరు బాగా వంట చేస్తారంటే తామిద్దరికీ వంట రాదన్నారు. కాకపోతే ప్రతిరోజు షూట్‌ నుంచి ఇంటికి రాగానే చై.. హాట్‌ చాక్లెట్‌ చేసిస్తాడంది శోభిత. అది వంట కిందకు రాదని, అది ప్రతి ఒక్కరికీ ఉండే కనీస నైపుణ్యం. కానీ నీకు లేదులే అని సెటైర్‌ వేశాడు. సినిమాలు చూడటం ఇష్టమని చై అంటుంటే.. చైను చూస్తూ ఉండిపోవడం నాకిష్టం అని పేర్కొంది శోభిత. చై 100 సినిమాలు చూస్తే నేను ఐదు చూసుంటానంది. వాదనల్లో ఎవరు గెలుస్తారన్న ప్రశ్నకు ఎప్పుడూ చైతూయే గెలుస్తాడంది.

అదే శోభిత హాబీ
శోభిత ఎక్కువ సరదాగా ఉంటుంది. నాకు ఫేమస్‌ పాటల హుక్‌ స్టెప్స్‌ నేర్పిస్తూ ఉంటుంది. అది తనకు హాబీ.. కాకపోతే అనారోగ్యానికి గురైనప్పుడు మాత్రం ప్రాణం పోయినట్లే చేస్తుంది. కాస్త అస్వస్థతకు గురైనా అసలు ఓర్చుకోలేదు. నీరసంతో కింద పడిపోతుంది అన్నాడు నాగచైతన్య.

చదవండి: బిగ్‌బాస్‌ నుంచి నాగార్జున తప్పుకోవాలి.. రానా బెటర్‌: సోనియా

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)