Breaking News

నాగచైతన్య తొలి సిరీస్‌ 'దూత'.. ఓటీటీలో అప్పటి నుంచే స్ట్రీమింగ్‌

Published on Wed, 11/15/2023 - 12:54

ఓటీటీలకు ఆదరణ విపరీతంగా పెరిగిపోయింది. అందుకే హీరోహీరోయిన్లందరూ ఓటీటీలోనూ ఎంట్రీ ఇస్తూ అదరగొడుతున్నారు. ఇప్పటికే చాలామంది డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో కనిపించగా తాజాగా నాగచైతన్య కూడా అందుకు సిద్ధమయ్యాడు. ఇతడు ప్రధాన పాత్రలో నటించిన వెబ్‌ సిరీస్‌ దూత. ఈ వెబ్‌ సిరీస్‌ ప్రకటించి చాలా రోజులు కావస్తున్నా దీని గురించి సోషల్‌ మీడియాలో పెద్ద ప్రచారం, అప్‌డేట్స్‌ లేకుండా పోయాయి. షూటింగ్‌ ఎప్పుడో పూర్తయినా విడుదల మాత్రం ఆలస్యం అవుతోంది.

ఎట్టకేలకు దూత విడుదల తేదీ ఖరారైంది. అమెజాన్‌ ప్రైమ్‌లో డిసెంబర్‌ 1 నుంచి అందుబాటులోకి రానుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది. మొత్తం ఎనిమిది ఎపిసోడ్‌లుగా ఈ సిరీస్‌ రానుందట. శరద్‌ మరార్‌ నిర్మించిన ఈ సిరీస్‌కు విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వం వహించారు. ఈయన నాగచైతన్యతో 'మనం', 'థాంక్యూ' సినిమాలు చేశారు. ఈ వెబ్‌ సిరీస్‌లో పార్వతీ తిరువోతు, ప్రియ భవానీ శంకర్‌, ప్రాచీ దేశాయ్‌, తరుణ్‌ భాస్కర్‌ ముఖ్య పాత్రలు పోషించారు.

చై సినిమాల విషయానికి వస్తే..
‘ప్రేమమ్, సవ్యసాచి’ వంటి చిత్రాల తర్వాత చందు మొండేటి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు నాగచైతన్య. సాయిపల్లవి హీరోయిన్‌గా చేస్తోంది. అల్లు అరవింద్‌ సమర్పణలో గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్నాడు. మత్స్యకారుల జీవితం నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రానికి తండెల్‌ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు టాక్‌. శ్రీకాకుళంలో మత్స్యకారులను తండెల్‌ అని పిలుస్తారట.

చదవండి: 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)