Breaking News

కామెడీ షురూ

Published on Sun, 09/07/2025 - 00:11

హీరో ‘అల్లరి’ నరేశ్‌ నటిస్తున్న 65వ సినిమా షురూ అయింది. చంద్రమోహన్‌ దర్శకత్వం వహిస్తున్న ‘నరేశ్‌ 65’ (వర్కింగ్‌ టైటిల్‌) చిత్రంలో ‘వెన్నెల’ కిశోర్, నరేశ్‌ వీకే, శ్రీనివాస్‌ రెడ్డి, మురళీధర్‌ గౌడ్‌ కీలక పాత్రలు చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌–హాస్య మూవీస్‌ బ్యానర్లపై రాజేశ్‌ దండా, నిమ్మకాయల ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్‌ బాబీ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, హీరో నాగచైతన్య క్లాప్‌ కొట్టారు.

దర్శకుడు వీఐ ఆనంద్‌ ఫస్ట్‌ షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించగా, దర్శకులు వశిష్ఠ, రామ్‌ అబ్బరాజు, విజయ్‌ కనకమేడల స్క్రిప్ట్‌ను నిర్మాతలకు అందజేశారు. 

‘‘యునిక్‌ కాన్సెప్ట్స్‌తో ఆకట్టుకున్న కామెడీ కింగ్‌ నరేశ్‌ తన కొత్త చిత్రం ‘నరేశ్‌ 65’తో తిరిగి కామెడీ జానర్‌లోకి వచ్చారు. ఈ సినిమాలో ఆయన సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రం ఫ్యాంటసీ, కామెడీ బ్లెండ్‌తో సరికొత్తగా ఉంటుంది. ఈ మూవీ రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలో ప్రారంభం కానుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: చేతన్‌ భరద్వాజ్, కెమెరా: రాంరెడ్డి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)