Breaking News

నాగచైతన్య- శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం.. నిజమెంత?

Published on Thu, 08/08/2024 - 07:48

టాలీవుడ్‌ బిగ్‌ బ్రేకింగ్‌ న్యూస్‌ అంటూ కొన్ని గంటలుగా ఒక వార్త నెట్టింట ప్రచారం జరుగుతుంది. దీనిని బేస్‌ చేసుకుని కొన్న ప్రధాన వెబ్‌ సైట్లు కూడా వాటిని ప్రచురించడం ప్రారంభించాయి. అక్కినేని నాగచైతన్య- నటి శోభితా ధూళిపాళ్ల ఎంగేజ్ మెంట్ ఈ రోజు జరగనుంది అంటూ వార్తలు వస్తున్నాయి. అతికొద్ది మంది సమక్షంలో నేడు (ఆగష్టు 8) ఈ కార్యక్రమం జరగనుందని వైరల్‌ అవుతుంది. ఈ విషయంపై అధికారికంగా అక్కినేని వారి కుటుంబంతో పాటు శోభితా ఫ్యామిలీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

2017లో నటి సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నాగచైతన్య. అయితే, వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో కొన్నేళ్లుగా దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో నటి శోభితా ధూళిపాళ్లతో నాగచైతన్య లవ్‌లో పడ్డారని చాలారోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కానీ, ఇప్పుడు వారిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని అందుకు సంబంధించిన మొదటి అడుగు నేడు పడుతుందని కొందరు చెబుతున్నారు.

నాగచైతన్య- నటి శోభితా ధూళిపాళ్ల ప్రేమలో ఉన్నారని ఇప్పటికే పలుమార్లు వార్తలు వచ్చినా వాటిని వారిద్దరూ ఖండించలేదు. దీంతో అభిమానుల్లో కూడా  నిజమే ఉంటుంది అనే భావన కలిగింది. ఇప్పుడు ఎంగేజ్‌మెంట్‌ జరగనుందని వార్తలు వస్తున్నాయి. నేడు ఈ కాకర్యక్రమం పూర్తి అయిన తర్వాత నాగార్జునే అధికారికంగా ఈ విషయాన్ని తెలుపుతారని సమాచారం. 

శోభితా ధూళిపాళ్ల పొన్నియిన్‌ సెల్వన్‌ ,ది నైట్‌ మేనేజర్‌ 2, గూఢాచారి,మేజర్‌,కురుప్ వంటి చిత్రాల్లో మెప్పించింది. కల్కి చిత్రంలో దీపికా పదుకొణ్‌కు తెలుగు డబ్బింగ్‌ కూడా చెప్పింది.  ఆంధ్రప్రదేశ్ తెనాలికి చెందిన ఈ బ్యూటీ ముంబై యూనివర్సిటీ, హెచ్.ఆర్ కాలేజ్‌లో కామర్స్ అండ్‌ ఎకనామిక్స్ పూర్తి చేసింది. 2013 మిస్ ఇండియా అందాల పోటీల్లో రెండో స్థానం సొంతం చేసుకుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)