Breaking News

శోభితతో పెళ్లి.. జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తున్నా: నాగచైతన్య

Published on Fri, 01/31/2025 - 16:16

లవ్‌స్టోరీ సినిమా తర్వాత నాగచైతన్య (Naga Chaitanya), సాయిపల్లవి మరోసారి జత కట్టిన మూవీ తండేల్‌ (Thandel Movie). కార్తికేయ 2 ఫేం చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దాదాపు రూ.80 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీపై నిర్మాత అల్లు అరవింద్‌ ధీమాగా ఉన్నాడు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

లైఫ్‌ ఎంజాయ్‌ చేస్తున్నా..
వైజాగ్‌ తనకు స్పెషల్‌ అని.. అక్కడ సినిమా ఆడిందంటే ప్రపంచంలో ఎక్కడైనా ఆడాల్సిందే అన్నాడు. వైజాగ్‌ తనకు ఎంత క్లోజ్‌ అంటే వైజాగ్‌ అమ్మాయి (శోభిత)ని ప్రేమించి, పెళ్లి చేసుకున్నానని.. ఇప్పుడు తన ఇంట్లో రూలింగ్‌ పార్టీ వైజాగే ఉందన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చై.. వైజాగ్‌ రూలింగ్‌ పార్టీ గురించి మాట్లాడాడు. వైవాహిక జీవితం చాలా బాగుంది. ప్రస్తుతం లైఫ్‌ను ఎంజాయ్‌ చేస్తున్నాను. మా పెళ్లయి కొన్ని నెలలే అవుతోంది. ఈ సమయంలో ఇద్దరం ఓపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క మాకంటూ ప్రత్యేక సమయం కేటాయించుకుంటున్నాం. 

(చదవండి: 93% సినిమాలు ఫ్లాప్‌.. వెయ్యి కోట్ల నష్టం.. నిర్మాతల కంట రక్తకన్నీరు!)

అదే మమ్మల్ని ఒకటిగా..
వర్క్‌ లైఫ్‌ను బ్యాలెన్స్‌ చేసుకుంటున్నాం. మా ఇద్దరికీ ఉన్న సేమ్‌ లక్షణాల్లో ఇదీ ఒకటి. అలాగే సినిమాపై మాకున్న ప్రేమ మాటల్లో చెప్పలేనిది. జీవితంపైనా మాకు ఎంతో ఆసక్తి ఉంది. అదే మమ్మల్ని ఒకటిగా ముందుకు నడిపించింది. మాకు ట్రావెలింగ్‌ అంటే కూడా ఇష్టం. భవిష్యత్తులో శోభిత, నేను ఒకే సినిమాలో కలిసి నటిస్తామా? లేదా? అన్నది నేనిప్పుడే చెప్పలేను. మంచి స్క్రిప్ట్‌ మమ్మల్ని వెతుక్కుంటూ వస్తే మాత్రం తప్పకుండా చేస్తాం అన్నాడు.

గతంలో నాగచైతన్య.. సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత పొరపచ్చాలు రావడంతో ఆమెకు విడాకులు ఇచ్చాడు. గతేడాది హీరోయిన్‌ శోభితను రెండో పెళ్లి చేసుకున్నాడు.

చదవండి: పెళ్లి తర్వాత నా భర్తనే మారిపోయాడు: వరలక్ష్మి శరత్ కుమార్

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)