నిహారిక విడాకులు.. తప్పు నాదే!: నాగబాబు

Published on Sun, 06/22/2025 - 11:44

కష్టాలు లేని జీవితం ఉండదు. మెగా డాటర్‌ నిహారిక లైఫ్‌లోనూ కష్టాలున్నాయి. ఎంతో అపురూపంగా పెరిగిన నిహారిక పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకుంది. 2020లో చైతన్య జొన్నలగడ్డను పెళ్లాడింది. కానీ తర్వాతే పరిస్థితులు తలకిందులయ్యాయి. నెమ్మదిగా ఇద్దరి మధ్య గొడవలు, దూరం, భేదాభిప్రాయాలు మొదలయ్యాయి. దీంతో 2023లో నిహారిక- చైతన్య విడాకులు తీసుకున్నారు.

ఆ ఒక్కటే అవసరం
తాజాగా ఈ విషయం గురించి నాగబాబు ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. నిహారిక, నేను ఎక్కువ మాట్లాడుకుంటాం. పిల్లల కెరీర్‌ విషయాల్లో నేను తలదూర్చను. నా పిల్లల హిట్స్‌, ఫ్లాప్‌ గురించి నాకవసరం లేదు. వాళ్లు సంతోషంగా ఉన్నారా? లేదా? అన్నదే ముఖ్యం. సంతోషంగా ఉంటే అది నాకు తృప్తి. వాళ్లు ఆనందంగా లేకపోతే ఎన్ని కోట్లున్నా వృథానే! వరుణ్‌.. లావణ్యను పెళ్లి చేసుకుంటానని నా దగ్గరకు వచ్చి అడిగినప్పుడు.. ఆమెతో నువ్వు సంతోషంగా ఉంటావా? భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రావు కదా? అన్నాను. లేదు, హ్యాపీగా ఉంటాం అని బదులిచ్చాడు. సరేనని పెళ్లి జరిపించాం. వాడి జడ్జిమెంట్‌ కరెక్ట్‌ అయింది. ఇద్దరూ సంతోషంగా ఉన్నారు.

తప్పు నాదే
కానీ నిహారిక విషయంలో నా జడ్జిమెంట్‌ తప్పయింది. ఆ పెళ్లి మేం చేసిన తప్పు. మేం సరిగా జడ్జిమెంట్‌ చేయలేకపోయాం. అలా అని తనకు ఇష్టం లేని పెళ్లి జరిపించలేదు. తను సంబంధం ఓకే అన్నాకే ముందుకు వెళ్లాం. కానీ.. తనకు, అబ్బాయికి సింక్‌ అవ్వలేదు. పరస్పర అంగీకారంతో విడిపోయారు. వారిద్దరూ కలిసుండేందుకు నేనెలాంటి ప్రయత్నాలు చేయలేదు. ఇష్టం లేదన్నారు, సరేనని చెప్పాను. ఇప్పుడు తను నిర్మాతగా సినిమాలు చేస్తోంది. కొంతకాలం పోయాక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుంటుంది అని చెప్పుకొచ్చాడు.

చదవండి: ఓటీటీలో అదరగొడుతున్న తెలుగు సినిమా

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)