Breaking News

అందరికంటే ముందుగా మీరే 'కల్కి'ని ఆదరించారు: నాగ్‌ అశ్విన్‌

Published on Mon, 07/01/2024 - 11:45

ప్రభాస్‌ పని అయిపోయిందన్న ప్రతిసారి రెట్టింపు వేగంతో డార్లింగ్‌ ముందుకు దూసుకు వస్తూనే ఉన్నాడు. కల్కి సినిమా ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేసిన మొదట్లో కూడా సినిమా పోయేలా ఉందన్న విమర్శలు వచ్చాయి. తీరా సినిమా రిలీజ్‌ చేశాక.. అప్పుడు విమర్శించినవారే వన్స్‌మోర్‌ అంటూ మరోసారి కల్కి చూసేందుకు థియేటర్‌కు పరుగులు తీస్తున్నారు. ఈ ఘనత ప్రభాస్‌ ఒక్కడిదే కాదు! తెర వెనక నుంచి నడిపించిన దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ది.

కలెక్షన్ల సునామీ
అభిమానులను ఏమాత్రం డిసప్పాయింట్‌ చేయకుండా కల్కి కళాఖండాన్ని తెరకెక్కించాడు. ప్రభాస్‌, అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద రూ.500 కోట్లు రాబట్టిన ఈ మూవీ ఓవర్సీస్‌లోనూ రికార్డులు తిరగరాస్తోంది.

హలో అమెరికా..
అమెరికా, కెనడాలోనే రూ.91 కోట్లకు పైగా రాబట్టింది. ఈ సందర్భంగా నాగ్‌ అశ్విన్‌ అక్కడి ఆడియన్స్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. హలో అమెరికా.. మేము తీసే ప్రతి సినిమాకు మీరెప్పుడూ అండగా ఉంటున్నారు. మంచి సినిమాలను ఆదరిస్తారు. కల్కి మీ సినిమాగా భావించి సపోర్ట్‌ చేశారు. అందుకు థాంక్యూ సో మచ్‌. 

ఇలాంటి చిత్రాలు అరుదుగా..
మీ ఫ్రెండ్స్‌, పిల్లలతో కలిసి సినిమాకు వెళ్లండి. కల్కి వంటి చిత్రాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఇది తప్పకుండా బిగ్‌ స్క్రీన్‌పై చూడాల్సిన మూవీ! ఇప్పటికే మీలో చాలామంది కల్కి చూసి ఎంజాయ్‌ చేశారు. అందరికంటే ముందుగా కల్కిని సపోర్ట్‌ చేసినందుకు మరోసారి థాంక్యూ అని వీడియో రిలీజ్‌ చేశాడు.

 

 

చదవండి: ప్రభాస్‌తో పోటీ కాదు.. నాదొక పాత్ర మాత్రమే..

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)