Breaking News

తిరుమలలో నాగ్‌ అశ్విన్‌.. కల్కి2 గురించి అప్డేట్‌

Published on Sat, 04/05/2025 - 07:36

డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌(Nag Ashwin), ప్రియాంక దత్‌ దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున శ్రీవారి సుప్రభాత సేవలో కుటుంబ సభ్యులతో పాటు వారు పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణం నుంచి వెళ్తుండగా అభిమానులు సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ప్రభాస్‌ 'కల్కి 2898 ఏడీ' పార్ట్‌-2 అప్‌డేట్‌ గురించి అడిగారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడి వెళ్లిపోయారు.

చాలారోజుల తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని నాగ్‌ అశ్విన్‌ అన్నారు. తెలుగు చిత్రపరిశ్రమ అంతా అంతా బాగుండాలని స్వామివారిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. కల్కి2 సినిమా గురించి మాట్లాడుతూ.. అందుకు ఇంకా చాలా టైమ్ పడుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోందని చెప్పారు. పూర్తయిన దాని బట్టి షూటింగ్‌ ప్రారంభిస్తామన్నారు. ఈ ఏడాది చివరి నాటికి సెట్స్‌పైకి వెళ్లే ప్రయత్నం చేస్తామని ఆయన ప్రకటించారు.

‘కల్కి’ పార్ట్‌2 గురించి కొద్దిరోజుల క్రితమే మీడియా సమావేశంలో నాగ్‌ అశ్విన్‌ మాట్లాడారు. మహాభారతం నేపథ్యం నుంచి సుమతి, అశ్వత్థామ పాత్రలను డిజైన్‌ చేశామన్నారు. ప్రస్తుతం ప్రభాస్‌ ఫుల్‌ బిజీగా ఉన్నారు. ఆయన చేతిలో ది రాజా సాబ్‌, ఫౌజీ (వర్కింగ్‌ టైటిల్‌), స్పిరిట్‌, సలార్‌2, కల్కి2 చిత్రాలు ఉన్నాయి. అందుకే కాస్త ఆలస్యం అయ్యే ఛాన్స్‌ ఉంది.

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)