Breaking News

అది సింగీతంగారి గొప్పతనం: నాగ్‌ అశ్విన్

Published on Mon, 06/15/2026 - 01:45

‘‘సింగ్‌ గీతం’కి పని చేసిన ప్రతి ఒక్కరి నిజాయితీ తెరపై కనిపించింది. అలాంటి మ్యాజిక్‌ను ప్లాన్ చేసి చేయలేం. ‘మహానటి’ తర్వాత ప్రేక్షకులు ఇంతగా ఓన్   చేసుకున్న సినిమా ఇదే. అది సింగీతంగారి గొప్పతనం’’ అన్నారు నాగ్‌ అశ్విన్  . అయాన్  , అహల్యా బుమ్రూ, షాలిని కొండెపూడి ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘సింగ్‌ గీతం’. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వైజయంతి మూవీస్, స్వప్న సినిమా పై నాగ్‌ అశ్విన్   నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలైంది. ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోందని యూనిట్‌ పేర్కొంది.

ఈ సందర్భంగా ఆదివారం జరిగిన గోల్డెన్   బ్లాక్‌బస్టర్‌ ఈవెంట్‌లో నాగ్‌ అశ్విన్   మాట్లాడుతూ– ‘‘సావిత్రిగారి గురించి రీసెర్చ్‌ చేస్తున్నప్పుడు తొలిసారి సింగీతంగారిని కలిశాను. లెజెండరీ ఫిల్మ్‌ మేకర్‌ అయిన ఆయన్ను ఒకసారి కలవడమే జీవితాంతం గుర్తుండి΄ోయే మెమరీ. కానీ ఆ జర్నీ ఇంత దూరం వస్తుందని ఊహించలేదు. ఆయన కలకు తెర రూపం ఇవ్వడం హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు తామే పాటలు పాడారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అద్భుతంగా కుదిరింది. ఈ సినిమాకు మరో దర్శకుడు సంకల్ప్‌.

94 ఏళ్ల దర్శకుడు, 24 ఏళ్ల దర్శకుడు కలిసి అందమైన మ్యాజిక్‌ను సష్టించారు’’ అన్నారు. అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా చాలా బాగుంది. సింగీతంగారు ఏడేళ్ల క్రితమే నాకీ కథ చె΄్పారు. చాలామంది నిర్మాతలను కలిసినా కుదర్లేదు. ఇప్పుడు నాగ్‌ అశ్విన్   రూపంలో అది సాధ్యమైంది’’ అని అన్నారు.  దేవిశ్రీ ప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘ఎప్పటినుంచో మంచి మ్యూజికల్‌ సినిమా చేయాలన్న నా ఆకాంక్ష ‘సింగ్‌ గీతం’తో నెరవేరింది. సింగీతంగారి 40 ఏళ్ల కల ఈ సినిమా. ఈ కలలో మేం భాగం కావడం హ్యాపీగా ఉంది.

ఈరోజు ఈ సెలబ్రేషన్‌ జరుగుతోందంటే దానికి ప్రధాన కారణం నాగ్‌ అశ్విన్‌గారు. ఎన్నో సినిమాలు బ్లాక్‌బస్టర్‌ అవుతాయి,  డబ్బులు, పేరు తెస్తాయి. కానీ ఒక క్రియేటర్‌కు నిజమైన సంతృప్తినిచ్చే సినిమాలు చాలా తక్కువ ఉంటాయి. నాకలాంటి సంతృప్తినిచ్చిన సినిమా ‘సింగ్‌ గీతం’’ అని చె΄్పారు. ‘‘సింగీతంగారిలాంటి లెజెండరీ దర్శకుడి సినిమాకి పని చేయడం మా అదృష్టం’’ అని ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సంకల్ప్, నటీనటులు నివేదా పేతురాజ్, అహల్య, శాలిని, అయాన్, రాహుల్‌ రవీంద్రన్, బెనర్జీ, శివన్నారాయణ తదితరులు పేర్కొన్నారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)