అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్
Breaking News
ఓటీటీకి సూపర్ హిట్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Published on Fri, 08/23/2024 - 21:11
కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన చిత్రం 'శాకాహారి'. ఈ మూవీ తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. సందీప్ సుంకడ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రంగాయన రఘు ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రాన్ని మర్డర్ మిస్టరీ థ్రిల్లర్గా తెరకెక్కించారు. కన్నడలో సూపర్హిట్గా నిలిచిన ఈ చిత్రం.. తాజాగా ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది.
ఈనెల 24 నుంచి ఆహా స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ ప్రకటించారు. తెలుగు ప్రేక్షకులకి సుపరిచితుడు గొప్పరాజు రమణ ఈ మూవీకి తెలుగు డబ్బింగ్ చెప్పారు. ఓటీటీ ప్రియులను మెప్పించేందుకు వచ్చేస్తోంది. ఈ చిత్రంలో గోపాలకృష్ణ దేశ్ పాండే .. వినయ్ .. నిధి హెగ్డే, హరిణి శ్రీకాంత్ కీలక పాత్రలు పోషించారు.
Crime, emotions, and unexpected turns - #Shakhahaari has it all! Premiering on aha on Aug 24. pic.twitter.com/oortLZG2nH
— ahavideoin (@ahavideoIN) August 21, 2024
Tags : 1