Breaking News

ఇళయరాజాపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సారీ చెప్పిన దర్శకుడు

Published on Mon, 01/27/2025 - 16:44

సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilayaraja)పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్‌ మిస్కిన్‌ క్షమాపణలు చెప్పాడు. బాటిల్‌ రాధ సినిమా ఈవెంట్‌లో మిస్కిన్‌ మాట్లాడుతూ.. తాను పెద్ద తాగుబోతునని చెప్పాడు. ఎన్నో సమస్యలకు మందు పరిష్కారమని చెప్పాడు. ఇళయరాజా సంగీతం వల్ల ఎందరో మద్యానికి అలవాటుపడ్డారన్నాడు. ఇళయరాజాపై ఈయన చేసిన కామెంట్లు వివాదాస్పదమవడంతో నేడు సారీ చెప్పాడు. తాను సరదాగా అన్న వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్నారని పేర్కొన్నాడు.

చులకనగా మాట్లాడటం కరెక్ట్‌ కాదు
తాజాగా ఈ వివాదంపై తమిళ హీరో విశాల్‌ (Vishal) స్పందించాడు. అందరూ ఆరాధించే ఇళయరాజాను అగౌరవపర్చడం ఏమాత్రం సమంజసం కాదన్నాడు. ఆయన సంగీతం వల్ల ఎంతోమంది డిప్రెషన్‌ నుంచి బయటపడ్డారని తెలిపాడు. అలాంటి మహనీయుడు గురించి, ఆయన సంగీతం గురించి చులకనగా మాట్లాడటం కరెక్ట్‌ కాదని హెచ్చరించాడు. విశాల్‌-మిస్కిన్‌ కాంబోలో 2017లో వచ్చిన తుప్పరివాలన్‌(తెలుగులో డిటెక్టివ్‌) పెద్ద హిట్‌ అయింది.

చేదు అనుభవం బయటపెట్టిన దర్శకుడు
ఇకపోతే మిస్కిన్‌ తాజాగా బాటిల్‌ రాధ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని బయటపెట్టాడు. 2013లో ఒనాయుమ్‌ ఆట్టుకుట్టియుమ్‌ సినిమా తీశాను. కొందరు ఈ మూవీ టెలివిజన్‌ రైట్స్‌ హక్కులు కొనేందుకు నన్ను సంప్రదించారు. ఓ బడా దర్శకుడు నాకు ఫోన్‌ చేసి ఈ సినిమా తాను కొంటానని, అందుకోసం పెద్ద మొత్తంలో డబ్బిస్తానంటూ ఓ చోటుకు రమ్మన్నాడు.

(చదవండి: ఈ వారం ఓటీటీలో 18 చిత్రాలు.. ఆ రెండు స్పెషల్‌!)

సగం కంటే తక్కువకే ఇచ్చేయమన్నారు
సరేనని అతడు చెప్పిన ప్రదేశానికి వెళ్లాను. నన్ను ఓ పెద్ద గదిలో కూర్చోబెట్టారు. ఆ గదిలో 20 మంది ఉన్నారు. రూ.75 లక్షలకే డిజిటల్‌ రైట్స్‌ ఇవ్వమని అడిగారు. ఎంతో కష్టపడి తీశాను సర్‌.. ఇది చాలా మంచి సినిమా.. కనీసం రూ.2 కోట్లు ఇవ్వండి అని కోరాను. కానీ వాళ్లు మాత్రం నా మాట వినలేదు. అంత డబ్బు ఇవ్వలేం.. మేము అడిగినదానికే డీల్‌ కుదిర్చేయ్‌ అని బలవంతం చేశారు. 

బెదిరించి బలవంతంగా సంతకం
కాసేపటికి వాళ్లందరూ గూండాలని అర్థమైంది. నన్ను బెదిరించి పత్రాలపై సంతకం తీసుకున్నారు. వాళ్లు చెప్పినట్లు రూ.75 లక్షలే ఇచ్చారు. ఇదంతా వెనకుండి నడిపించిన వ్యక్తి ఇండస్ట్రీలో పేరు మోసిన డైరెక్టర్‌. నా సినిమాను ఇప్పటివరకు వారి ఛానల్‌లో 80 సార్లు వేసి ఉంటారు. అది టీవీలో కూడా హిట్టయింది అని చెప్పుకొచ్చాడు.

చెప్పు విసురుతానని..
ఇళయరాజాపై వ్యాఖ్యల గురించి స్పందిస్తూ.. కొన్నిరకాల వివాదాలు నిర్మాతలను ఇబ్బందిపెడతాయి. అందుకే నా వల్ల ఏ సమస్యా ఉండకూడదని సారీ చెప్తున్నాను. అయితే నా వ్యాఖ్యలు విన్న నా స్నేహితుడు నాపై చెప్పు విసురుతానన్నాడు. నా చెప్పు సైజ్‌ 8.. కాబట్టి ఒకటికి బదులుగా రెండు విసరమని చెప్పాను. అతడికి కూడా క్షమాపణలు చెప్పాను. ఆరోజు సరదాగా అన్న మాటల్ని చాలాదూరం తీసుకెళ్తున్నారు. అందుకే సారీ చెప్తున్నా అన్నాడు మిస్కిన్‌.

చదవండి: క్యాన్సర్‌తో పోరాటం.. అన్నీ వదిలేసి నటికి సపర్యలు చేస్తున్న ప్రియుడు

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)