Breaking News

‘అఖండ’ లాగే వీర సింహారెడ్డికి కూడా స్పీకర్లు పగులుతాయి: తమన్‌

Published on Wed, 01/11/2023 - 11:01

‘‘పోటీ అనేది సినిమాల్లోనే కాదు.. ప్రతి చోటా ఉంటుంది. పోటీ ఉన్నప్పుడే మంచి కంటెంట్‌ వస్తుంది. ఆరోగ్యకరమైన సోటీ మంచిదే. అన్ని సినిమాలూ గొప్పగా ఆడాలి.. అందరూ బాగుండాలి’’ అని సంగీత దర్శకుడు ఎస్‌ఎస్‌ తమన్‌ అన్నారు. బాలకష్ణ, శ్రుతీహాన్‌ జంటగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించిన ఈ సినిమా రేపు (గురువారం) రిలీజవుతోంది. ఈ చిత్రానికి సంగీతం అందించిన తమన్‌ మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన చిత్ర విశేషాలు.

⇔ బాలకృష్ణగారితో నేను చేసిన ‘అఖండ’ సినిమాతో ‘వీరసింహారెడ్డి’కి పోలికే లేదు. ఇది కల్ట్‌ మూవీ. ఎమోషనల్, సిస్టర్‌ సెంటిమెంట్, బాలకృష్ణగారి మాస్‌.. ఇలా అన్ని అంశాలతో అదిరిపోతుంది.

⇔ దర్శకుడు మంచి సినిమా తీస్తేనే నేను మంచి మ్యూజిక్‌ ఇవ్వగలను. ఒక సినిమాకి పునాది దర్శకుడే. బాలకృష్ణగారి అభిమానిగా గోపీచంద్‌ చాలా గొప్పగా తీశారు.. దాని వల్లే నాకూ మంచి మ్యూజిక్, నేపథ్య సంగీతం ఇచ్చే అవకాశం వచ్చింది. సినిమా ఏం కోరుకుంటుందో అది ఇవ్వడమే మన పని. ఇందులో ‘జై బాలయ్య, సుగుణ సుందరి, మాస్‌ మొగుడు..’ వంటి పాటలన్నీ చక్కగా కుదిరాయి. మాస్‌ సినిమాలో కూడా కథ నుండే ట్యూన్‌  పుడుతుంది.

⇔ ‘అఖండ’లో మ్యూజిక్‌కి స్పీకర్లు పగిలిపోయాయి. ‘వీరసింహారెడ్డి’లోనూ స్పీకర్లు పగులుతాయి జాగ్రత్త అని ముందే చెప్పాను. బాలకృష్ణగారిని చూస్తేనే ఎక్కువ వాయించేయాలనిపిస్తుంది (నవ్వుతూ). చాలా రోజుల తర్వాత సెకండ్‌ హాఫ్‌లో నాలుగు పాటలు, నాలుగు ఫైట్లతో అదరగొట్టే సినిమా ఇది. పాప్‌ కార్న్‌ తినే టైమ్‌ కూడా ఉండదు.. సినిమాని చూస్తూనే ఉంటారు.

⇔ ఈ సంక్రాంతికి విడుదలవుతున్న చిరంజీవిగారి ‘వాల్తేరు వీరయ్య’, బాలకష్ణగారి ‘వీరసింహారెడ్డి’ రెండూ గొప్పగా ఆడాలని కోరుకుంటున్నాను. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)