Breaking News

'ప్రభాస్‌' సీక్వెల్‌ అదిరిపోతుంది.. సంగీత దర్శకుడు కామెంట్‌

Published on Sat, 01/24/2026 - 08:57

ప్రభాస్‌ అభిమానులను ‘ది రాజాసాబ్‌’ కాస్త నిరాశపరిచింది. అయినప్పటికీ డార్లింగ్‌ ఇమేజ్‌కు ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ మూవీ తర్వాత ఆయన నుంచి ఫౌజీ, స్పిరిట్‌,  సినిమాలు  తెరపైకి రానున్నాయి. ఈ రెండూ ఇప్పుడు షూటింగ్‌ దశలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, అతి త్వరలోనే ‘కల్కి 2’ కూడా మొదలు కానుంది. ఇదే విషయాన్ని సంగీత దర్శకుడు సంతోష్‌ నారాయణన్‌ తెలిపారు. ‘కల్కి 2898ఏడీ’కి కొనసాగింపుగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించనున్నారు.

కల్కి2 గురించి సంగీత దర్శకుడు సంతోష్‌ నారాయణన్‌ ఇలా అన్నారు. 'కల్కి -2 నా కెరీర్‌లోనే టాప్‌ సినిమాగా ఉండబోతుంది. ఈ మూవీ కోసం నేను అందించబోయే సంగీతం చాలా అద్భుతంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. అందుకోసం మా టీమ్‌ చాలా కష్టపడుతుంది. కల్కి 2898AD మా అందరికీ ఒక మెగా లెర్నింగ్. మేము ఇప్పటికే కల్కి పార్ట్-2 కోసం పని చేయడం ప్రారంభించాము. ఈ మూవీలో పాల్గొనే నటీనటుల తేదీలు సర్దుబాటు అయిన తర్వాత, షూటింగ్ ప్రారంభమవుతుంది.' అని ఆయన అన్నారు. సంతోష్ నారాయణన్ చేసిన తాజా ప్రకటనతో అంచనాలను గణనీయంగా పెంచారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి సీక్వెల్‌పైనే ఉంది.

భారీ బడ్జెట్‌తో వైజయంతీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీలో ప్రభాస్‌తో పాటు అమితాబ్‌ బచ్చన్, కమల్‌హాసన్‌ తదితరులు కీలక పాత్రలలలో పోషిస్తున్నారు. ఫిబ్రవరి నుంచి చిత్రీకరణ ప్రారంభం కానున్నట్లు సమాచారం. అయితే, ప్రభాస్‌ మార్చి తర్వాత కల్కి-2 సెట్‌లోకి అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్‌ ఇందులో భైరవగా, కర్ణగా రెండు పాత్రల్లో కనిపించనున్నారు.
 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)