ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
Breaking News
తన అనుభవం అంతవరకే.. అది మారదు: తమన్‌పై కోటి కామెంట్స్
Published on Mon, 02/02/2026 - 21:36
టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు కోటి (సాలూరి కోటేశ్వరరావు) పేరు పరిచయం అక్కర్లేదు. తెలుగులో లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరు సంపాదించుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన తన సినీ కెరీర్ గురించి మాట్లాడారు. అంతేకాకుండా తెలుగు సినిమాపై పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రస్తుతం సంగీత దర్శకుల గురించి ఆయన కామెంట్స్ చేశారు. ఏఆర్ రెహమాన్‌తో పాటు ఎస్ఎస్ తమన్ గురించి వ్యాఖ్యానించారు.
టాలెంట్ ఉంటేనే ఇండస్ట్రీ గుర్తిస్తుందని కోటి అన్నారు. తమన్ కూడా మంచి మ్యూజిక్ అందించారని.. నేషనల్ అవార్డ్ కూడా అందుకున్నాడని.. వరల్డ్ మ్యూజిక్‌కు దగ్గరగా ఉంటుందని తెలిపారు. బీజీఎం పరంగా తమన్ స్టైల్ చాలా బాగుంటుందని అన్నారు. తమన్ రిపీటెడ్‌గా చేయడంపై చేస్తారన్న ప్రశ్నకు కోటి స్పందించారు.
ఇక్కడ అతనికి ఒక ప్రొగ్రెషన్ అనేది రిపీట్ అవుతుందని కోటి అన్నారు. తన అనుభవం అంతవరకే.. అది మారదని తెలిపారు. ఎవరికైనా ఒక టైమ్ ఉంటుందని.. అంతవరకే చేయగలరని వెల్లడించారు. కొత్త నీరు వస్తూనే ఉంటోంది.. దాన్ని మనం అంగీకరించాల్సిందేనని పేర్కొన్నారు. ఇండస్ట్రీలో ఇక్కడ ఎవరి స్టాండర్స్ వాళ్లవని సంగీత దర్శకుడు కోటి అన్నారు. మార్కెట్ ప్రకారమే మనం ముందుకు వెళ్లాలని సూచించారు. మ్యూజిక్‌లో ప్రజంటేషన్ అనేది చాలా ముఖ్యమని తెలిపారు. ఇప్పుడున్న జనరేషన్‌లో నాకు మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టమని అన్నారు.
Tags : 1