Breaking News

నా జీవితంలో ఈ సినిమా ఓ అద్భుతం

Published on Sun, 01/05/2025 - 00:34

వెంకటేశ్‌ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ‘దిల్‌’ రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం మ్యూజిక్‌ డైరెక్టర్‌ భీమ్స్‌ సిసిరోలియో మాట్లాడుతూ– ‘‘సంక్రాంతికి వస్తున్నాం’ మంచి ఫ్యామిలీ మూవీ. చిన్న క్రైమ్‌ డ్రామా కూడా ఉంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘గోదారి గట్టు, మీనూ, బ్లాక్‌బస్టర్‌ పొంగల్‌...’ పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ రావడం ఆనందంగా ఉంది. మణిశర్మ, రమణ గోగులగార్లకు నేను అభిమానిని. ‘గోదారి గట్టు’ పాటను  రమణ గోగులగారితో పాడించడం సంతోషాన్నిచ్చింది. 

అలాగే కొంత గ్యాప్‌ తర్వాత మధు ప్రియగారు ఈ పాట పాడారు. అనంత శ్రీరామ్‌ ‘మీనూ..’ పాటకు మంచి లిరిక్స్‌ ఇచ్చారు. ‘మీనూ..’ పాటను అనిల్‌గారు నన్నే పాడమన్నారు. నాతో పాటు ఈ పాటను ప్రణవి ఆచార్య పాడారు. ‘బ్లాక్‌బస్టర్‌ పొంగల్‌...’ పాటకు రామజోగయ్య శాస్త్రిగారు సాహిత్యం అందించారు. ఈ పాటను అర్ధరాత్రి వెంకటేశ్‌గారు విని, మార్నింగ్‌ వచ్చి తానే పాడతానని అన్నారు. ఆయనే పాడారు. నేను, రోహిణి గొంతు కలిపాము. పాట పాడిన తర్వాత నేను పాడిన పాట నచ్చకపోతే తీసేయమని వెంకటేశ్‌గారు అన్నారు.

 వాస్తవానికి ఆయన స్థాయి, ఇమేజ్‌కు ఆ మాట అనాల్సిన అవసరం లేదు. ఇక మా సినిమాలోని పాటలకు మంచి స్పందన లభిస్తోందంటే కారణం... సాహిత్యం పట్ల అనిల్‌గారికి ఉన్న అభిరుచి. ‘దిల్‌’ రాజుగారి డీపీఆర్‌ బేనర్‌లో ‘బలగం’ మూవీ చేశాను. ఇప్పుడు ఇంత పెద్ద సినిమా చేసే చాన్స్‌ కల్పించినందుకు ఆయనకు రుణపడి ఉంటాను. ఇలా అన్ని విధాలా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా నా జీవితంలో జరిగిన ఓ అద్భుతం’’ అన్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)