Breaking News

'జైలర్'కి మరో హీరో అనిరుధ్‌.. రెమ్యునరేషన్ అన్ని కోట్లు!

Published on Sun, 08/13/2023 - 09:18

'జైలర్' హవా ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. సూపర్‌స్టార్ రజినీకాంత్ దెబ్బకు బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ కళ్లుచెదిరే వసూళ్లు వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో రజినీ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ బాగా హైలైట్ అయ్యాడు. మరి 'జైలర్'కి మరో హీరో అయిన అనిరుధ్‌కి ఇచ్చిన రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే మీరు అవాక్కవడం గ్యారంటీ.

రజినీకాంత్ 'జైలర్' స్టోరీ నార్మల్‌గా ఉన్నప్పటికీ.. ఈ రేంజులో సినిమా హిట్ అయిందంటే దానికి కారణం అనిరుధ్ అని బల్లగుద్ది చెప్పొచ్చు. ఎందుకంటే చాలా సాధారణమైన సీన్స్‌ని కూడా తన బ్యాక్‌గ్రౌండ్ స్కోరుతో ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు. 'హుకుమ్' పాట అయితే ఇంకా ఫ్యాన్స్ చెవుల్లో మార్మోగుతూనే ఉంది. ఇలాంటి టైంలో అనిరుధ్ రెమ్యునరేషన్ గురించి ఇంట్రెస్టింగ్ విషయం బయటపడింది.

(ఇదీ చదవండి: సిద్ధార్థ్... నాతో నటించడానికి భయపడ్డాడు: ప్రముఖ నటుడు)

'జైలర్' హీరోగా నటించిన రజినీకాంత్‌కు రూ.110 కోట్ల పారితోషికం ఇచ్చారని సమాచారం. ఇక మిగిలిన వారిలో మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌కే ఎక్కువట. ఏకంగా రూ.10 కోట్ల వరకు ఇతడు అందుకున్నట్లు తెలుస్తోంది. మొన్నటివరకు రూ.8 కోట్లు మాత్రమే తీసుకున్న అనిరుధ్.. 'జైలర్'తో ఏఆర్ రెహమాన్(రూ.8 కోట్లు)నే దాటేశాడు. అలానే ఇతడు ప్రస్తుతం అందుకుంటున్న మొత్తం, చాలామంది యంగ్ హీరోలకు ఇచ్చేదాని కంటే ఎక్కువ అని చెప్పొచ్చు.

మరోవైపు అనిరుధ్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. తెలుగు నిర్మాతలు కూడా మనోడి వెంట పడుతున్నారు. రూ.10 కోట్లు కంటే ఎక్కువే ఇస్తామని చెబుతున్నారు. మరోవైపు పవన్ 'అజ్ఞాతవాసి'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఇతడు.. నాని 'జెర్సీ'తో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్-కొరటాల కాంబోలో తీస్తున్న 'దేవర' కోసం పనిచేస్తున్నాడు. ఏదేమైనా సరే ఓ సంగీత దర‍్శకుడు గురించి ఇంతలా మాట్లాడుకోవడం ఆసక్తి కలిగిస్తోంది.

 

(ఇదీ చదవండి: స్టార్ హీరోకు గాయాలు.. మొదలైన రోజే ఇలా!)

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)