Breaking News

మనవరాలి పెళ్లిపై మురళీమోహన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Published on Mon, 12/30/2024 - 15:16

మనవరాలి పెళ్లితో నటుడు మురళీ మోహన్‌ (Murali Mohan).. సంగీత దర్శకుడు కీరవాణికి చుట్టమయ్యాడు. మురళీ మోహన్‌ మనవరాలు రాగ.. కీరవాణి కుమారుడు, హీరో శ్రీ సింహ (Sri Simha) ఈ మధ్యే పెళ్లిపీటలెక్కారు. ఈ వివాహ వేడుకలో ఇరు కుటుంబాలు ఆటపాటలతో, డ్యాన్సులతో ఉత్సాహంగా గడిపారు. తాజాగా ఈ వెడ్డింగ్‌ గురించి మురళీ మోహన్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

అలా మొదలైంది
'రాజమౌళి కోడలు పూజ, నా మనవరాలు రాగ క్లోజ్‌ ఫ్రెండ్స్‌. ఇద్దరూ ఒకరింటికి ఒకరు వెళ్లేవారు. ఆ సమయంలో రాజమౌళి (SS Rajamouli), కీరవాణి కుటుంబాలు ఎంత బాగా కలిసున్నాయో కళ్లారా చూసింది. ఫ్రెండ్స్‌లాగా ఒకరిపై మరొకరు జోకులు వేసుకుంటూ చాలా క్లోజ్‌గా, ఆప్యాయతగా ఉంటారు. వీకెండ్‌ వచ్చిందంటే ఫామ్‌ హౌస్‌కు వెళ్లి గేమ్స్‌ ఆడేవారు.

తనే ప్రపోజ్‌ చేసింది
ఇదంతా రాగకు బాగా నచ్చింది. తనకు చిన్నప్పటి నుంచి ఉమ్మడి కుటుంబమంటే చాలా ఇష్టం. అందుకని ఆ రెండు కుటుంబాలు అలా కలిసిమెలిసి ఉండటం చూసి ముచ్చటపడిపోయింది. తనే ఒకరోజు శ్రీసింహకు ప్రపోజ్‌ చేసింది. ఈ విషయం మొదట మాకు చెప్పలేదు. పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు నీకు నచ్చినవాళ్లెవరూ లేరా? అని అడిగాను. అప్పుడు తన మనసులో మాట బయటపెట్టింది. 

(చదవండి: అల్లు అర్జున్‌ను అరెస్ట్‌ చేయడం కరెక్టే: పవన్‌ కల్యాణ్‌)

ఎంత సంతోషమేసిందో!
కీరవాణి కుమారుడు శ్రీసింహను ఇష్టపడ్డాను.. మీరందరూ అనుమతిస్తే పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. తన సెలక్షన్‌ బాగుండటంతో అందరం ఓకే అన్నాం. పెళ్లిలో కూడా వాళ్లు ఎంత బాగా ఇన్వాల్వ్‌ అయ్యారో.. పెళ్లికూతుర్ని వధువు తరపువారు పల్లకి మోస్తూ మండపానికి తీసుకెళ్లాలి. కానీ అప్పుడు కీరవాణి పెద్దబ్బాయి కాలభైరవ సహా మరికొందరు పల్లకి మోసి తనను తీసుకెళ్లారు. ఎంతో సంతోషమేసింది' అని చెప్పుకొచ్చాడు.

రాగ ఎవరంటే?
మురళీ మోహన్‌కు కుమారుడు, కూతురు ఉన్నారు. కుమారుడు రామ్‌మోహన్‌- రూపల కుమార్తెనే రాగ. కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహ విషయానికి వస్తే యమదొంగలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించాడు. మత్తు వదలరా మూవీలో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

చదవండి: ఆ సంఘటనతో మతం మారాను: రెజీనా కసాండ్రా

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)