Breaking News

క్యాస్టింగ్‌ కౌచ్‌.. ఇండస్ట్రీ వదిలేద్దామనుకున్నా: హీరో

Published on Fri, 10/04/2024 - 19:27

సక్సెస్‌ ఒక్కరోజులో రాదు. ఎన్నో కష్టనష్టాలకోర్చిన తర్వాతే విజయం చేతికి అందుతుంది. బాలీవుడ్‌ నటుడు అభయ్‌ వర్మ విషయంలోనూ ఇదే నిజమైంది. ముంజ్య సినిమాతో ఇప్పుడితడు బాలీవుడ్‌ లేటెస్ట్‌ సెన్సేషన్‌గా నిలిచాడు. తాజాగా అతడు కెరీర్‌ తొలినాళ్లలో ఎదురైన క్యాస్టింగ్‌ కౌచ్‌ అనుభవాన్ని చెప్పుకొచ్చాడు.

సంబంధం లేకుండా మాట్లాడారు
అవకాశాల కోసం ఎదురుచూస్తున్నరోజుల్లో జరిగిందీ ఘటన.. ముంబై నుంచి పిలుపు రాగానే ఎగిరి గంతేశాను. తీరా అక్కడికి వెళ్లాక నా టాలెంట్‌ గురించి కాకుండా ఇంకేదేదో మాట్లాడారు. నా ప్రతిభను చూపించుకునే అవకాశం ఇవ్వలేదు. వాళ్లింకేదో ఆశించారు. నా విలువలను నాశనం చేసుకోలేక నో చెప్పాను. తొలి మీటింగ్‌లోనే చేదు అనుభవం ఎదురవడంతో నిరాశచెందాను. ముంబై వదిలేసి నా స్వస్థలమైన పానిపట్‌(హర్యానా)కు తిరిగి వచ్చేశాను. కానీ నటుడవ్వాలన్న కోరికను అణుచుకోలేకపోయాను. 

మళ్లీ అడుగుపెట్టా..
ఎవరికోసమో భయపడి నేనెందుకు వెనకడుగు వేయాలనుకున్నాను. మరింత క్లారిటీతో మళ్లీ ముంబైలో అడుగుపెట్టాను. ఆడిషన్స్‌ ఇస్తూ పోయాను. అలా నటుడిగా నా కెరీర్‌ మొదలైంది అని ఎప్పుకొచ్చాడు. కాగా అభయ్‌ వర్మ ప్రధాన పాత్రలో నటించిన ముంజ్య మూవీ జూన్‌ 7న విడుదలైంది. ఆదిత్య సర్పోట్‌దర్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద వంద కోట్లపైనే రాబట్టింది. ఇకపోతే అభయ్‌ ప్రస్తుతం కింగ్‌ అనే చిత్రంలో నటిస్తున్నాడు.

బిగ్‌బాస్‌ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)