Breaking News

ది రాజాసాబ్‌ హీరోయిన్‌కు చేదు అనుభవం.. పోలీసులు నిద్రలేచారు!

Published on Sun, 06/15/2025 - 14:10

తంగలాన్ బ్యూటీ మాళవిక మోహనన్ ప్రస్తుతం ప్రభాస్ సరసన నటిస్తోంది. మారుతి డైరెక్షన్‌లో వస్తోన్న ది రాజాసాబ్‌లో కనిపించనుంది. మలయాళం, తమిళ చిత్రాలతో ఫేమ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్‌ 5న థియేటర్లలో రిలీజ్‌ కానుంది. ఇప్పటికే మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు.

‍అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన మాళవిక మోహనన్ తనకెదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది. ముంబయి లోకల్ ట్రైన్‌లో ప్రయాణిస్తున్న సమయంలో ఓ వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది. తన స్నేహితులతో కలిసి రాత్రి సమయంలో లోకల్‌ ట్రైన్‌లో ప్రయాణిస్తుండగా  కంపార్ట్‌మెంట్‌ వద్ద ఉన్న గ్లాస్‌ డోర్‌ నుంచి ఓ వ్యక్తి తమవైపే చూస్తూ ముద్దిస్తావా అని సైగలు చేశాడని తెలిపింది. ఆ సమయంలో తీవ్ర భయాందోళనకు గురైనట్లు మాళవిక పంచుకుంది. ముంబయి లాంటి నగరంలో మహిళల భద్రత లేదని నటి మాళవిక మోహనన్ తెలిపింది.

అయితే ఈ వార్త చూసిన ముంబయి పోలీసులు ఆమె జరిగిన ఘటనపై స్పందించారు. మాళివిక గారు మేము మీ గురించి వార్తల్లో చూశాం.. మీకెదురైన అనుభవాన్ని పంచుకున్నారు. నగరంలో మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి అనుభవాలు ఆశ్చర్యకరంగా దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతాయి.  నగరంలో రోజులో ఏ సమయంలో లేదా ఏ ప్రదేశంలోనైనా.. దయచేసి 112 లేదా 100 నంబర్‌లో మమ్మల్ని సంప్రదించండి. మేము వీలైనంత త్వరగా మీకు అండగా నిలుస్తామని తెలిపారు.

(ఇది చదవండి: రాత్రి ట్రైన్‌లో ప్రయాణం.. ఏకంగా ముద్దిస్తావా? అని అడిగాడు: మాళవిక మోహనన్)

ముంబయి పోలీసులు తమ పోస్ట్‌లో రాస్తూ..'ముంబై నగరం ఎల్లప్పుడూ మహిళలకు సురక్షితంగా ఉంటుంది. భద్రత మరింత మెరుగుపరచడానికి మేము ఎలాంటి చర్యలకైనా సిద్ధం. నేరస్థుడిని తగిన విధంగా.. చట్టబద్ధంగా శిక్షిస్తాం. దయచేసి మీ పేరును ఉపయోగించి ఈ విషయాన్ని వ్యాప్తి చేయండి. ఇలాంటి సమస్యలను పరిష్కరించడంలో బాగా సహాయపడుతుంది.' అని విజ్ఞప్తి చేశారు.
 

 

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)