Breaking News

'సోనాక్షి రియాక్షన్ ఆశ్చర్యం కలిగించింది'.. హీరోయిన్‌పై ముకేశ్ ఖన్నా సెటైర్లు

Published on Tue, 12/17/2024 - 20:59

బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌ వివాదానికి దారితీసింది. ప్రముఖ శక్తిమాన్ ఫేమ్, నటుడు ముకేశ్ ఖన్నాను ఉద్దేశించి ఆమె తన ఇన్‌స్టా స్టోరీస్‌లో సుదీర్ఘమైన పోస్ట్ చేసింది. మీ మాటలు చూస్తుంటే కావాలనే నన్ను టార్గెట్ చేసినట్లు ఉందని రాసుకొచ్చింది. నా తండ్రి శతృఘ్న సిన్హా పెంపకంపై మీరు విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. నాతో పాటు అక్కడే ఉన్న మరో ఇద్దరు మహిళలు కూడా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారని సోనాక్షి గుర్తు చేశారు.

అసలేం జరిగిందంటే..

గతంలో అంటే 2019లో సోనాక్షి సిన్హా కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్‌లో ప్రత్యేక అతిథిగా పాల్గొంది. ఆ సమయంలో రామాయణం గురించి ఆమెకు ఓ ప్రశ్న ఎదురైంది. హనుమంతుడు ఎవరి కోసం సంజీవని తెచ్చాడని సోనాక్షిని హోస్ట్ ప్రశ్నించాడు. దీనికి ఆమె సరైన సమాధానం చెప్పలేకపోయింది. సోనాక్షి మాత్రమేకాదు.. అక్కడే ఉన్న మరో ఇద్దరు సైతం ఆన్సర్ చేయలేకపోయారు. ఇది చూసిన ముకేశ్ ఖన్నా.. కూతురిని సరిగా పెంచలేదంటూ శతృఘ్న సిన్హాను ఉద్దేశించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. అది కాస్తా వైరల్ కావడంతో తాజాగా సోనాక్షి ఆయనకు కౌంటర్‌గా పోస్ట్ పెట్టింది.

అయితే తాజాగా సోనాక్షి పోస్ట్‌పై శక్తిమాన్ నటుడు ముకేశ్ ఖన్నా స్పందించారు. ఈ విషయంపై సోనాక్షి చాలా ఆలస్యంగా స్పందించిందని అన్నారు. తన పెంపకాన్ని ప్రశ్నించడం పట్ల తనకు ఎలాంటి దురుద్దేశం తెలిపారు. ఆమె తండ్రి చేసిన తప్పువల్లే సోనాక్షి సమాధానం చెప్పలేకపోయిందన్నారు. అయితే ఇంత ఆలస్యంగా రియాక్ట్‌ కావడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని ముకేశ్ అన్నారు.

ముకేశ్ ఖన్నా మాట్లాడుతూ.. 'తను రియాక్ట్ అవ్వడానికి చాలా సమయం పట్టింది. ఈ విషయంలో నాకు ఆశ్చర్యం కలిగించింది. అయితే ఈ విషయంలో ఆమెను, అలాగే ఆమె తండ్రిని కించపరిచే ఉద్దేశ్యం నాకు లేదు. అతనితో నాకు చాలా సత్సంబంధాలు ఉన్నాయి' ‍అని తెలిపారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)