Breaking News

ఓటీటీలో 'ముఫాసా: ది లయన్‌ కింగ్‌' స్ట్రీమింగ్‌

Published on Thu, 02/06/2025 - 15:35

హాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌ ఫిల్మ్‌ ‘ది లయన్‌ కింగ్‌ (2019)’ సినిమాకు ప్రీక్వెల్‌గా ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ అనే చిత్రం  రూపొందిన సంగతి తెలిసిందే. గతేడాదిలో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.  బారీ జెంకిన్స్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. వాల్ట్‌ డిస్నీ పిక్చర్స్‌ పతాకంపై అడెలె రోమన్‌ స్కీ, మార్క్‌ సెరియాక్‌ ఈ సినిమాను నిర్మించారు. డిసెంబరు 20న విడుదలైన ఈ సినిమా ఇండియాలో కూడా ప్రేక్షకులను మెప్పించింది. సుమారు రూ. 1260 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 3,200 కోట్లు రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఇప్పుడు ఓటీటీకి రానున్నడంతో ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ చిత్రం ఫిబ్రవరి 18న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రీమియర్ అవుతుంది.  అయితే, రెంటల్‌ విధానంలో అధనంగా డబ్బు చెల్లించి ఈ చిత్రాన్ని చూసే అవకాశం ఉంటుంది. ఆపై ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీ, ఫాండాంగోతో సహా వీడియో-ఆన్-డిమాండ్ (VOD) ప్రాతిపదికన అందుబాటులో ఉంటుంది. ఇక్కడ కూడా అదనంగా రెంట్‌ చెల్లించాల్సి ఉంటుంది.  ఏప్రిల్ 1 నుంచి మాత్రమే ఈ చిత్రాన్ని ఉచితంగా చూసే అవకాశం ఉంటుందని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కు సంబంధించిన ఒకరు స్క్రీన్‌రాంట్ మీడియాతో తెలిపారు.

ఇంగ్లిష్‌, హిందీ, తమిళ, తెలుగు భాషల్లో  విడుదలైన  ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ చిత్రంలో టైటిల్‌ రోల్‌కు టాలీవుడ్‌ స్టార్‌ హీరో మహేశ్‌బాబు వాయిస్‌ ఓవర్‌ ఇవ్వడంతో తెలుగు ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది. హిందీ వెర్షన్‌లో ముఫాసా పాత్రకు షారుక్‌ ఖాన్‌, ముఫాసా చిన్నప్పటి పాత్రకు ఆయన కుమారుడు అబ్రం వాయిస్‌  అందించారు. ఈ చిత్రంలోని  సింబా పాత్రకు షారుక్‌ పెద్ద కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ వాయిస్‌ ఇవ్వడం విశేషం.

Videos

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)