Breaking News

ధోని ఎంట్రీ ఖాయం ..ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త

Published on Tue, 07/25/2023 - 07:27

ఇప్పటి వరకూ క్రికెట్‌లో దుమ్ము రేపిన క్రికెట్‌ క్రీడాకారుడు ఎంఎస్‌ ధోని ఇప్పుడు చిత్ర నిర్మాణంలో ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. ఈయన ధోని ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి 'ఎల్‌జీఎం' అనే చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. హరీష్‌ కల్యాణ్‌, ఇవనా జంటగా నటించిన ఇందులో నటి నదియా, యోగిబాబు తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.

(ఇదీ చదవండి: ఈ సినిమా బడ్జెట్‌నే రూ. 200 కోట్లు.. నెట్‌ఫ్లిక్స్‌ ఎన్ని కోట్లకు కొన్నదో తెలిస్తే)

రమేష్‌ తమిళమణి దర్శకుడిగా పరిచయం అయిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 28న విడుదల కానుంది. ఇదంతా తెలిసిన కథే. ఈ చిత్రం ద్వారా నిర్మాతగా మారిన ధోనీ అక్కడితో ఆగలేదు. ఈ చిత్రంతో ఆయన నటుడిగానే అవతారమెత్తారు. తాజా సమాచారం. నటుడు కమలహాసన్‌ కథానాయకుడిగా నటించిన సూపర్‌ హిట్‌ చిత్రం చివరి ఘట్టంలో రోలెక్స్‌ పాత్రలో నటుడు సూర్య మెరిసిన విషయం తెలిసిందే. అది 10 నిమిషాల గెస్ట్‌ పాత్ర అయినా సూర్య అభిమానుల్లో రోలెక్స్‌ పాత్ర పెద్దగా ముద్ర వేసుకుంది. సూర్య కనిపిస్తే వారు రోలెక్స్‌ అంటూ గోల చేస్తున్నారు.

(ఇదీ చదవండి: ‘బలగం’ తర్వాత యష్‌తోనే సినిమా ఎందుకంటే:దిల్‌ రాజు)

కాగా ఎల్‌జీఎం చిత్రంలో ఎంఎస్‌ ధోనీ ఆ తరహా పాత్రలో ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలిసింది. ఇది ఆయన అభిమానులు సంబరపడే విషయమే అవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈ విషయాన్ని రివీల్‌ చేయకుండా అభిమానులుకు థ్రిల్‌ ఇవ్వాలని మేకర్స్‌ భావించారట. క్రికట్‌లో తన మార్క్‌ ఎలా అయితే వేశాడో . ఈ సినిమాలో కేవలం 10 నిమిషాల్లో కనిపించినా తన రోల్‌ను మాత్రం ప్రేక్షకులు మరిచిపోలేరని సమాచారం. అలా సూర్యకు రోలెక్స్‌ ఎలాంటి గుర్తింపు వచ్చిందో.. ధోనికి కూడా ఈ సినిమా అలాంటి గుర్తింపే తెస్తుందని మేకర్స్‌ భావిస్తున్నారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)