Breaking News

ధనుష్‌తో డేటింగ్‌ వార్తలు.. మరో అడుగు ముందుకేసిన మృణాల్

Published on Fri, 08/08/2025 - 11:15

నటి మృణాల్ ఠాకూర్ తమిళ స్టార్ ధనుష్‌తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ, ఆ విషయాన్ని ఆ ఇద్దరూ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే, తాజాగా మృణాల్ ఈ వార్తలను నిజం చేసేలా మరో అడుగు ముందుకేసింది ధనుష్  సిస్టర్స్‌ డాక్టర్ కార్తీక కృష్ణమూర్తి, విమల గీతలను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వడం మొదలుపెట్టి  అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలో వారిద్దరు కూడా మృణాల్‌ను  ఫాలో అయ్యారు. దీంతో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతుంది.

నటి మృణాల్ ఠాకూర్ ఇటీవల కాలంలో తన సినిమాల కంటే తన వ్యక్తిగత జీవితానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.   డేటింగ్ వార్తలు వస్తున్నప్పటికీ కూడా ధనుష్‌ కుటుంబానికి ఆమె మరింత దగ్గరవుతుంది. దీంతో ఈ వార్తలు నిజమనేదానికి మరింత బలాన్ని చేకూరుస్తుంది. ధనుష్ సోదరీమణులు డాక్టర్ కార్తీక కృష్ణమూర్తి, విమల గీతలను ఇన్‌స్టాగ్రామ్‌లో మృణాల్ ఫాలో అవ్వడం అభిమానులు గమనించారు. మృణాల్ ఠాకూర్‌కు ధనుష్‌ ఇంట్లో మరింత ప్రాముఖ్యత పెరిగిందని చెప్పవచ్చు. ధనుష్‌ కోసం మొదట తన ఆడబిడ్డలను లైన​్‌లో పెట్టే పనిలో మృణాల్ ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఆగష్టు 1న మృణాల్ పుట్టినరోజు వేడుకలో ధనుష్ పాల్గొన్నారు. పార్టీ వీడియోలో ధనుష్ ఆమె చేతిని పట్టుకుని ఆత్మీయంగా మాట్లాడుతున్న దృశ్యం ఒకటి వైరల్ అయింది. ఆపై మృణాల్ ఠాకూర్‌ నటించిన కొత్త సినిమా 'సన్ ఆఫ్ సర్దార్ 2' స్పెషల్ స్క్రీనింగ్‌కు ధనుష్ ప్రత్యేకంగా ముంబైకి వెళ్లారు. స్క్రీనింగ్ సమయంలో ధనుష్ చెవిలో మృణాల్ ఏదో గుసగుసలాడటం కనిపించింది. జులై 3న ధనుష్, ఆనంద్ ఎల్. రాయ్ బాలీవుడ్‌ సినిమా 'తేరే ఇష్క్ మే' షూటింగ్‌ను ముగించాడు. ఈ సందర్భంగా జరిగిన పార్టీకి మృణాల్ హాజరయ్యారు. అక్కడ కూడా వీరిద్దరూ కలిసి కనిపించారు. దీంతో వారిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ విషయంపై ఎవరో ఒకరు స్పందిస్తే క్లారిటీ వస్తుంది.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)