Breaking News

డెకాయిట్‌ కోసం..

Published on Sun, 07/06/2025 - 03:57

‘డెకాయిట్‌’ కోసం హైదరాబాద్‌ చేరుకున్నారు మృణాల్‌ ఠాకూర్‌. అడివి శేష్, మృణాల్‌ ఠాకూర్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఇంటెన్స్‌ యాక్షన్‌ లవ్‌స్టోరీ చిత్రం ‘డెకాయిట్‌’. ‘ఏక్‌ ప్రేమ్‌ కథ’ అనేది ట్యాగ్‌లైన్‌. షనీల్‌ డియో డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. తాజాగా ఈ సినిమా సెట్స్‌లోకి అడుగుపెట్టారు మృణాల్‌ ఠాకూర్‌. ‘డెకాయిట్‌’ సినిమా సెట్స్‌లోకి జాయిన్‌ అయినట్లుగా తన ఇన్‌స్టా అకౌంట్‌లో కన్ఫార్మ్‌ చేశారీ బ్యూటీ. ఈ కీలక షెడ్యూల్‌తో ఈ సినిమా చిత్రీకరణ దాదాపు తుది దశకు చేరుకుంటుందట.

ఇద్దరు మాజీ ప్రేమికులు తమకు ఇష్టం లేకపోయినా ఓ క్రైమ్‌ను కలిసి చేయాల్సి వస్తే ఏం జరుగుతుంది? అన్నదే ఈ సినిమా కథాంశమనే ప్రచారం సాగుతోంది. అంతేకాదు... ఈ సినిమాలోని కొంత భాగం రాయలసీమ నేపథ్యంలో ఉంటుందని, మదనపల్లె యాసలో అడివి శేష్‌ క్యారెక్టర్‌ ఉంటుందని ఫిల్మ్‌నగర్‌ భోగట్టా. ఇక ఈ సినిమాలో బాలీవుడ్‌ దర్శక–నిర్మాత–నటుడు అనురాగ్‌ కశ్యప్‌పోలీస్‌ ఆఫీసర్‌గా చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబరు 25న విడుదల కానుంది.

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)