Breaking News

'వార్‌-2' నష్టం ఎంతో ఫైనల్‌గా చెప్పిన నాగ వంశీ

Published on Fri, 12/26/2025 - 07:42

ఈ ఏడాదిలో బాలీవుడ్‌తో పాటు తెలుగు ప్రేక్షకులు భారీగా ఎదురుచూసిన చిత్రం వార్‌-2.. అయాన్‌ ముఖర్జీ  తెరకెక్కించిన ఈ మూవీని యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన సంగతి తెలిసిందే.  దీని తెలుగు రైట్స్‌ను రూ. 80 కోట్లకు నిర్మాత నాగవంశీ దక్కించుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. సినిమా డిజాస్టర్‌గా మిగిలిపోవడంతో సుమారు రూ. 50 కోట్లు నష్టపోయాడని వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా ఒక ఇంటర్వ్యూలో తను క్లారిటీ ఇచ్చాడు. అసలు వార్‌-2 ఎంత మొత్తానికి కొన్నాడో చెప్పుకొచ్చాడు.

'వార్‌-2 సినిమాలో నేను భారీగా నష్టపోయానని చాలామంది అంటున్నారు. అందులో ఎలాంటి నిజం లేదు.  తెలుగు రైట్స్‌ రూ. 68 కోట్లకు దక్కించుకున్నాను. మూవీ క్లోజింగ్‌ అయ్యేసరికి రూ. 40 కోట్ల వరకు షేర్‌ వచ్చింది.  అయితే, యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ సంస్థ నాకు రూ. 18 కోట్లు రిటర్న్‌ ఇచ్చింది. బాంబే కంపెనీ అయినప్పటికీ వారు నిజాయితీగానే తిరిగి డబ్బులు ఇచ్చేశారు. వార్‌-2 వల్ల నేను నష్టపోలేదు.' అని మొదటిసారి లెక్కలతో సహా వంశీ చెప్పారు. ఈ లెక్కన తను రూ.  10 కోట్లు నష్టపోయినట్లు తెలుస్తోంది.

జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించిన తొలి బాలీవుడ్‌ చిత్రం కావడంతో టాలీవుడ్‌లో కూడా ఈ మూవీపై భారీ హైప్‌ క్రియేట్‌ అయింది. ఇందులో హృతిక్‌ రోషన్‌, అనిల్ కపూర్, కియారా అద్వానీ, అశుతోష్ రాణా తదితరులు నటించారు. ఈ చిత్రం విడుదలైన మొదటిరోజు నుంచే కొందరు కావాలనే ట్రోలింగ్‌ చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా ఏపీలో తెలుగు దేశం పార్టీ క్యాడర్ జూనియర్ ఎన్టీఆర్‌ సినిమాకు మద్దతు ఇవ్వడం మానేసింది. వారు కూలీ సినిమా చూడాలని పెద్ద ఎత్తున సోషల్‌మీడియాలో సూచించారు. అదే సమయంలో వార్‌2 చిత్రంపై తీవ్రమైన ట్రోలింగ్‌కు దిగారు. దీంతో బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్స్‌పై ప్రభావం పడింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)