Breaking News

డీజీపీని కలిసిన 'మా' ప్రతినిధులు.. ట్రోలర్స్‌కు చుక్కలే!

Published on Thu, 07/18/2024 - 15:58

సాక్షి, హైదరాబాద్‌: విమర్శ మంచిదే కానీ అది హద్దు దాటకూడదు. ఈ మధ్య కాలంలో పలువురు నెటిజన్లు, యూట్యూబర్స్‌.. సెలబ్రిటీలను విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు. వారు చేసే పని గురించే కాకుండా వ్యక్తిగత విషయాలను సైతం చర్చిస్తూ దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో మా(మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్‌) నటీనటుల గురించి అసభ్యంగా మాట్లాడిన ఐదు యూట్యూబ్‌ ఛానల్స్‌ను తొలగించింది.

స్పెషల్‌ సెల్‌
గురువారం నాడు మా బృందం డీజీపీ జితేందర్‌ను కలిసింది. సెలబ్రిటీలను టార్గెట్‌ చేసుకుని వీడియోలు వదులుతున్న 200 యూట్యూబ్‌ ఛానల్స్‌ లిస్టును డీజీపికి సమర్పిస్తూ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన ఆయన.. సైబర్‌ సెక్యూరిటీ వింగ్‌లోని ఓ స్పెషల్‌ సెల్‌ ఇకపై దీనిపైనే ఫోకస్‌ చేస్తుందని హామీ ఇచ్చారు. ట్రోలర్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

ఫ్యామిలీని కూడా వదలట్లేదు
అనంతరం రాజీవ్‌ కనకాల మాట్లాడుతూ.. ట్రోల్స్‌ నవ్వుకునేలా ఉండాలి కానీ ఏడిపించేలా ఉండొద్దు. కుటుంబ సభ్యుల మీద కూడా ట్రోల్‌ చేయడం దారుణం. ఇకమీదట నటీనటులను ట్రోల్స్‌ చేస్తే సహించేది లేదు అని వార్నింగ్‌ ఇచ్చారు. శివ బాలాజీ మాట్లాడుతూ.. దారుణమైన ట్రోల్స్‌కు పాల్పడేవారిని టెర్రరిస్టులుగా పరిగణిస్తాం. సుమారు 200 యూట్యూబ్‌ ఛానల్స్‌ లిస్టును డీజీపీకి సమర్పించాం. ఆయన సానుకూలంగా స్పందించారు అని తెలిపారు.

మహిళా ఆర్టిస్టులే టార్గెట్‌
నటుడు శివకృష్ణ మాట్లాడుతూ.. మహిళా ఆర్టిస్టుల క్యారెక్టర్‌ను దారుణంగా చిత్రీకరిస్తున్నారు. కొన్ని యూట్యూబ్‌ ఛానెల్స్‌ డబ్బు కోసం ఇలా చేస్తున్నాయి. కానీ దీనివల్ల లేడీ ఆర్టిస్టులు ఎక్కువ ఇబ్బందిపడుతున్నారు అని చెప్పుకొచ్చారు.

చదవండి: మరో రెండు ఓటీటీల్లోకి తెలుగు యాక్షన్‌ మూవీ.. ఎక్కడంటే?

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)