Breaking News

15 ఏళ్లకే పెళ్లి.. నా కడుపులో బిడ్డకు తండ్రెవరని అడిగాడు: నటి

Published on Sat, 05/27/2023 - 17:44

'రోటీ కప్‌డా ఔర్‌ మకాన్‌', 'అనురాగ్‌' వంటి సినిమాలతో బాగా ఫేమస్‌ అయింది సీనియర్‌ నటి మౌసమి చటర్జీ. తన కెరీర్‌లో వందకుపైగా సినిమాలు చేసింది. ఆత్మగౌరవానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చే ఆమెను దివంగత స్టార్‌ నటుడు రాజేశ్‌ ఖన్నా దారుణంగా అవమానించాడట. తాజాగా ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది మౌశమి.

నీ బిడ్డకు తండ్రి ఎవరు?
మౌసమి మాట్లాడుతూ.. 'నేను గర్భవతిగా ఉన్నప్పుడు రాజేశ్‌ ఖన్నా ఓ ప్రశ్న అడిగాడు. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి నీ భర్త జయంత ముఖర్జీయేనా? లేదంటే నటుడు వినోద్‌ మెహ్రానా? అని ప్రశ్నించాడు. నాకెంత కోపం వచ్చిందో! నిజానికి నటుడు వినోద్‌ మెహ్రా మంచి వ్యక్తి. అతడు మా పెళ్లికి కూడా వచ్చాడు. అయినా రాజేశ్‌ ఖన్నా చాలాసార్లు చండాలంగానే మాట్లాడేవాడు. ఈరోజు ఆయన లేరనుకోండి.

నేను కూడా ఇచ్చిపడేశా
రాజేశ్‌ చనిపోవడానికి కొద్ది రోజుల ముందు ఆయన అనారోగ్యంతో ఉంటే పరామర్శించడానికి వెళ్లాను. నా కూతురి ముందే నన్ను మెచ్చుకుంటూ ఏదేదో వాగాడు. మీ అమ్మ ఎంత పిచ్చిదంటే తనను చూసి మేమంతా భయపడేవాళ్లం. తను ఏదీ అంత ఈజీగా నమ్మేది కాదని చెప్పాడు. ప్రతిసారి నేనెందుకు భరిస్తాను. తనకు కూడా ఇచ్చిపడేశాను. తన పిల్లల వంక చూస్తూ వీళ్లు నీ పిల్లలా? లేదంటే రిషి కపూర్‌ సంతానమా? అని అడిగేశా. నా నుంచి ఇది ఊహించని రాజేశ్‌ నోట మాట రాక షాక్‌ అయిపోయాడు.

కాంప్రమైజ్‌కు ఒప్పుకోలేదని..
ఇకపోతే 'దేశ్‌ ప్రేమి', 'బర్సాత్‌ కీ ఏక్‌ రాత్‌' వంటి ఎన్నో సినిమాలకు నేను సంతకం చేశాను. కానీ చివరకు నన్ను సినిమా నుంచి తీసేవారు. ఎందుకంటే వాళ్లు అడిగే కాంప్రమైజ్‌కు నేను ఒప్పుకునేదాన్ని కాదు. అడ్డదారిలో నేను సినిమాలు చేయలేను. చాలామంది సీనియర్‌ హీరోయిన్లు నువ్వింత అందంగా ఉన్నావు, టాలెంట్‌ ఉంది.. కానీ హీరోల ఫేవరెట్‌ లిస్టులో మాత్రం లేవని అంటూ ఉండేవారు. అయినా సరే, నాకు నచ్చకుండా ఏ పనీ చేసేదాన్ని కాదు' అని చెప్పుకొచ్చింది మౌసమి.

15 ఏళ్ల వయసులోనే పెళ్లి
కాగా రాజేశ్‌ ఖన్నా హీరోయిన్‌ డింపుల్‌ కపాడియాను పెళ్లాడాడు. వీరికి ట్వింకిల్‌ ఖన్నా, రింక్‌ల్‌ ఖన్నా అని ఇద్దరు కూతుర్లు జన్మించారు. మౌసమి విషయానికి వస్తే ఆమె 15 ఏళ్ల వయసులోనే జయంత్‌ ముఖర్జీని పెళ్లాడింది. వీరికి మేఘ, పాయల్‌ అని ఇద్దరు కూతుర్లు సంతానం. పాయల్‌ చిన్నవయసులోనే మధుమేహం బారిన పడగా 45 ఏళ్ల వయసులో ఆమె మరణించింది.

చదవండి: కడుపులో కణతి.. నటికి ఆపరేషన్‌.. 3 వారాలుగా బెడ్‌పైనే

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)