మాఫియా డాన్‌తో ప్రేమాయణం.. జైలుకెళ్లిన ఈ నటి గుర్తుందా?

Published on Sat, 01/25/2025 - 15:17

ఒకప్పుడు బాలీవుడ్‌లో మాఫియా డాన్‌ల హవా కొనసాగేది. దర్శక నిర్మాతలతో పాటు హీరోహీరోయిన్లతో కూడా వాళ్లకు పరిచయం ఉండేది. ఆ పరిచయం కొందరికి వరంగా మారితే..మరికొందరికి మాత్రం శాపంగా మారింది. మాఫియా డాన్‌తో ప్రేమలో పడి కెరీర్‌ని నాశనం చేసుకోవడమే కాదు.. జైలుకు కూడా వెళ్లింది ఓ హీరోయిన్‌. ఆ హీరోయిన్‌ పేరే మోనికా బేడి(Monica Bedi). పంజాబ్‌లోని హోషియార్‌పూర్ జిల్లా చబ్బేవాల్ గ్రామంలో జన్మించిన ఈ బ్యూటీ ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యాభ్యాసం పూర్తి చేసింది. ఆమె తల్లిదండ్రులు 1979లో నార్వేలోని డ్రామెన్‌కి మారారు.

డాన్‌తో ప్రేమలో..
మోనికా బేడి కెరీర్‌ పీక్స్‌లో ఉన్న సమయంలో మాఫియా డాన్‌ అబు సలేంతో ప్రేమలో పడింది. అది కూడా విచిత్రంగానే జరిగింది. అబు ఎవరనేది కూడా మొదట్లో మోనికాకు తెలియదు. అతను డాన్‌ అనే విషయం తెలియకుండానే ప్రేమలో పడిపోయానని ఓ ఇంటర్వ్యూలో మెనికా చెప్పింది. ‘దుబాయ్‌లో ఈవెంట్‌ కోసం నాకు ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఆ ఫోన్‌ చేసింది అబు సలేం. ఈవెంట్‌ కోసం నేను దుబాయ్‌ వెళ్లినప్పుడు మొదటి సారిగా అబుని కలిశాను. చాలా బాగా చూసుకున్నాడు. అప్పుడప్పుడు కాల్‌ చేసి మాట్లాడేవాడు. అలా 9 నెలల పాటు ఫోన్‌లోనే మాట్లాడుకున్నాం. అతని మాటలు, కేరింగ్‌ నచ్చి ప్రేమలో పడిపోయాను.అతని కోసం దుబాయ్‌ కూడా వెళ్లాను. ప్రేమలో ఉన్నప్పుడు గంటకోసారి ఫోన్‌ చేసేవాడు. అయితే అతను వ్యాపారవేత్త అనే నాకు తెలుసు. దుబాయ్‌లో బిజినెస్‌ చేస్తున్నాంటే నాతో చెప్పాడు. అతను డాన్‌ అనే విషయం నాకు తెలియదు. పేరు కూడా మార్చి చెప్పాడు’ అని మెనికా చెప్పింది.

ఐదేళ్లు జైలు శిక్ష!
అబుతో ప్రేమలో పడిన తర్వాత మెనికా ఇండస్ట్రీకి దూరం అవుతూ వచ్చింది. సినిమాలు తగ్గించి ఎక్కువ సమయం అతనితోనే గడిపింది. 2002లో సెప్టెంబరు 2002లో, నకిలీ పత్రాలపై దేశంలోకి ప్రవేశించినందుకు పోర్చుగల్‌ లో ఆమెతో పాటు అబూ సలేం అనే భారతీయ గ్యాంగ్‌స్టర్ అరెస్టు చేశారు. ఆ తరువాత ఆమె ఐదేళ్లు  జైలు శిక్ష సైతం అనుభవించింది. ఇలా మాఫియా డాన్‌తో పరిచయమే ఆమె కెరీర్‌ని నాశనం చేసింది. లేదంటే మెనికా బాలీవుడ్‌లో ఓ స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగేది.  

తెలుగులోనూ సినిమాలు..
శ్రీకాంత్ హీరోగా నటించి తాజ్ మహల్ సినిమాతో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిన మోనికా.. త తర్వాత బాలీవుడ్‌కి వెళ్లి అక్కడ స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందింది. షారుఖ్‌, సల్మాన్‌ లాంటి బాలీవుడ్‌ స్టార్‌ హీరోలందరితోనూ నటించింది. అలాగే తెలుగులో  శివయ్య , సోగ్గాడి పెళ్ళాం, సర్కస్ సత్తిపండు, చూడాలని వుంది (1998) సినిమాలతో అలరించింది.  హిందీ బిగ్‌బాస్‌ సీజన్‌ 2 తో పాటు పలు టీవీ షోల్లో పాల్గొంది. ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. ప్రస్తుతం మెనికా ఎక్కడ ఉంది, ఏం చేస్తుందనే విషయాలు మాత్రం బయటకు రావడం లేదు.

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)