బిజీ అయిపోయిన మోనాలిసా.. అప్పుడే గెటప్‌ మార్చేసిందిగా!

Published on Fri, 02/14/2025 - 21:26

కుంభమేళాతో మోనాలిసా (Monalisha Bhosle) దశ తిరిగిపోయింది. పూసలమ్ముకునేందుకు కుంభమేళాకు వచ్చిన ఆమె తన అందమైన తేనెకళ్ల కారణంతో రాత్రికి రాత్రే స్టార్‌ అయిపోయింది. సోషల్‌ మీడియా ఆమెకు దాసోహమైపోయింది. ఇంత అందాలరాశి ఇన్నాళ్లూ ఏమైపోయిందన్నట్లుగా కుప్పలుతెప్పలుగా కామెంట్లు.. కట్‌ చేస్తే ఇప్పుడు హీరోయిన్‌ కూడా!

విమానం ఎక్కిన మోనాలిసా
బాలీవుడ్‌ దర్శకుడు సనోజ్‌ మిశ్రా ఆమెకు 'ది డైరీ ఆఫ్‌ మణిపూర్‌' (The Diary of Manipur) సినిమాలో అవకాశం ఇచ్చాడు. అంతేకాదు, నిరక్షరాస్యురాలైన ఆమెకు చదువు నేర్పించే బాధ్యతను భుజాన వేసుకున్నాడు. ఇప్పుడు ముఖానికి మేకప్‌ వేసి అందంగా ముస్తాబవడాన్ని కూడా నేర్పించాడు. కేరళలో ఓ షాప్‌ ఓపెనింగ్‌ కోసం ఆమెను దగ్గరుండి తీసుకెళ్లాడు. అది కూడా విమానంలో! విమానం ఎక్కడం మొదటిసారి కావడంతో మోనాలిసా కొంత భయం, మరికొంత సంతోషానికి లోనైంది. 

లుక్‌ మార్చేసిన బ్యూటీ
ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె తన సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేసింది. ఇక షాప్‌ ఓపెనింగ్‌లో మోనాలిసా తన గెటపే మార్చేసింది. తన జుట్టును చిన్నగా కత్తిరించుకుని దాన్ని స్టైల్‌ చేసింది. రెడ్‌ కలర్‌ గాగ్రా డ్రెస్‌లో మెరిసింది. తన లుక్‌ను చూసిన ఫ్యాన్స్‌ ఇప్పుడు మరింత అందంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. ఒక్క కుంభమేళా తన జీవితాన్నే మార్చేసిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

 

 

 

చదవండి: నేను హీరో అనగానే చాలామంది హీరోయిన్లు రిజెక్ట్‌ చేశారు: లవ్‌టుడే హీరో

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)