Breaking News

ఫిబ్రవరిలో ఒక్కటి తప్ప అన్నీ ఫ్లాపే.. ఒక సినిమాకైతే రూ.10 వేలే వచ్చాయ్‌!

Published on Thu, 03/20/2025 - 18:26

హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉన్నాయి. అలా మలయాళంలో (Mollywood) గత నెలలో 17 సినిమాలు రిలీజయ్యాయి. అందులో ఎన్ని హిట్టయ్యాయి? ఎన్ని నష్టాల్ని మిగిల్చాయి? అన్న నివేదిక బయటకు వచ్చింది. కేరళ చలనచిత్ర నిర్మాతల మండలి (కేఎఫ్‌పీఏ) ఫిబ్రవరి బాక్సాఫీస్‌ రిపోర్టు (Malayalam Film Industry Report- February 2025)ను విడుదల చేసింది. 

మాలీవుడ్‌కు రూ.53 కోట్ల నష్టం
ఈ నివేదిక ప్రకారం.. గత నెలలో 17 సినిమాలు రిలీజ్‌ చేస్తే అందులో ఆఫీసర్‌ ఆన్‌డ్యూటీ సినిమా (Officer on Duty Movie) మాత్రమే బడ్జెట్‌కు దగ్గరగా వసూళ్లు రాబట్టింది. మిగతా చిత్రాలన్నీ తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. 17 సినిమాల బడ్జెట్‌ అంతా కలిపితే రూ.75 కోట్లు కాగా.. అందులో కేవలం రూ.23.55 కోట్లు మాత్రమే వెనక్కు రావడం గమనార్హం. అంటే దాదాపు రూ.53 కోట్ల నష్టం వాటిల్లింది. రూ.13 కోట్లతో నిర్మితమైన ఆఫీసర్‌ ఆన్‌డ్యూటీ సినిమా ఇప్పటివరకు రూ.11 కోట్ల షేర్‌ (రూ.50 కోట్ల గ్రాస్‌) సాధించింది. ఇప్పటికీ విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. 

కాపాడలేకపోయిన స్టార్‌ హీరో
అయితే ఈ మూవీ నేడు (మార్చి 20) నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చేసింది. దీని ప్రభావం బాక్సాఫీస్‌ కలెక్షన్లపై పడనుంది. మార్కో వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తర్వాత ఉన్నిముకుందన్‌ హీరోగా నటించిన చిత్రం గెట్‌ సెట్‌ బేబీ. రూ.10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ కేవలం రూ.1.40 కోట్ల షేర్‌ మాత్రమే రాబట్టింది. ఈ సినిమా బ్రేక్‌ ఈవెన్‌ అవడం కూడా కష్టమే! లవ్‌ డేల్‌ అనే సినిమా అయితే రూ.1.60 కోట్లు పెట్టి తీయగా కేవలం రూ.10 వేలు మాత్రమే తెచ్చిపెట్టి నిర్మాతలను నిండా ముంచేసింది.

పేరు ఘనం.. కలెక్షన్స్‌ శూన్యం
మలయాళ చిత్రాలకు సెపరేట్‌ ఫ్యాన్స్‌ బేస్‌ ఉన్నారు. అయినా పేరు ఘనం.. ఫలితం శూన్యం అన్నట్లు ఎప్పుడూ ఈ ఇండస్ట్రీ నష్టాల్లోనే కొట్టుమిట్టాడుతోంది. చాలామంది ఈ చిత్రాలను థియేటర్లలో కన్నా ఓటీటీలోనే ఎక్కువగా ఆదరిస్తున్నారు. దీనికి తోడు నిర్మాణ వ్యయాలు పెరగడం, నటీనటులు పారితోషికం పెంచడంతో బడ్జెట్‌ తడిసిమోపడవుతోంది. కనీసం లాభాలు కాదుకదా పెట్టుబడి వెనక్కి వచ్చినా చాలనుకునే దయనీయ స్థితి మాలీవుడ్‌లో కనిపిస్తోంది.

కేరళ చలనచిత్ర నిర్మాతల మండలి విడుదల చేసిన నివేదిక నిజంగా షాక్‌కు గురిచేసింది. ఫిబ్రవరిలో రిలీజైన 17 సినిమాల్లో ఆఫీసర్‌ ఆన్‌డ్యూటీ మూవీ మాత్రమే పెట్టిన పెట్టుబడికి సమీపంలో వసూళ్లు రాబట్టింది. అన్నింటికీ కలిపి రూ.73 కోట్లు పెడితే కేవలం రూ.23.55 కోట్లు మాత్రమే వెనక్కు రావడం విచారకరం.
- శ్రీధర్‌ పిళ్లై, సినీ విశ్లేషకుడు


గ్రాస్‌: మొత్తం సినిమా టికెట్ల అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బు

నెట్‌: గ్రాస్‌ వసూళ్ల నుంచి ప్రభుత్వానికి ట్యాక్స్‌ కట్టగా మిగిలేది నెట్‌

షేర్‌: నెట్‌ వసూళ్ల నుంచి థియేటర్‌ అద్దె, నిర్వహణ వంటి ఖర్చులు తీసేయగా మిగిలేది షేర్‌

చదవండి: హీరో అజిత్‌ను పేరు పెట్టి పిలిచా.. అందరూ షాకయ్యారు: నటుడు

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)