Breaking News

మాజీ సీఎంపై ప్రముఖ కమెడియన్‌ వివాదాస్పద కామెంట్స్!

Published on Fri, 07/21/2023 - 18:38

ఇటీవలే కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీ మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మృతికి రాజకీయ ప్రముఖులు, మలయాళ సినీతారలు సైతం సంతాపం వ్యక్తం చేశారు. కేరళ ప్రభుత్వం సైతం ఆ మృతికి రెండు రోజుల పాటు సంతాపదినాలు ప్రకటించింది. ఈ నేపథ్యంలో మలయాళ స్టార్ కమెడియన్ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇంతకీ ఆయన ఏం మాట్లాడారు? ఎందుకు వివాదంగా మారిందో తెలుసుకుందాం. 

మాలీవుడ్ నటుడు వినాయకన్ సోషల్ మీడియాలో లైవ్ పెట్టి మరీ మాజీ సీఎంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అయితే ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో కొద్ది నిమిషాలకే సోషల్ మీడియా నుంచి తొలగించాడు.

(ఇది చదవండి: సినీ ఇండస్ట్రీని కుదిపేసిన ఘటన.. హీరోయిన్‌పై అత్యాచారయత్నం!)

లైవ్  వీడియోలో వినాయకన్ మాట్లాడుతూ.. 'అసలు ఊమెన్ చాందీ ఎవరు?. మూడు రోజులుగా అతని మరణం గురించి మీడియాలో విస్తృతంగా కవరేజీ రావడం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇలాంటి వార్తలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం మానుకోవాలని మీడియాను కోరారు. మరణం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో సాధారణంగా జరిగేదే. అందరిలాగే ఊమెన్ చాందీ కూడా చనిపోయారు. అంతే కాకుండా ఊమెన్ చాందీని మంచి వ్యక్తిగా చిత్రీకరించడం తప్పు..' అని విమర్శలు చేశారు. దీంతో కేరళలో పెద్దఎత్తున విమర్శలు రావడంతో వినాయకన్ ఆ లైవ్ వీడియోను తన సోషల్ మీడియా ఖాతా నుంచి డిలీట్ చేశాడు. కాగా.. వినాయకన్ తదుపరి ఆసిఫ్ అలీ నటిస్తోన్న 'కాసర్ గోల్డ్' చిత్రంలో నటిస్తున్నారు. 

(ఇది చదవండి: రెండోసారి తల్లి కాబోతున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్!)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)