కొత్త భార్యపై ప్రేమ.. మాజీ భార్యను గుర్తుచేస్తున్న నెటిజన్లు

Published on Tue, 08/11/2026 - 17:44

బాలీవుడ్‌ నటి ఊర్మిళ మటోండ్కర్‌ మాజీ భర్త మోహ్సిన్‌ అక్తర్‌ మీర్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ ఏడాది జూన్‌లో నిధా భట్‌ను వివాహం చేసుకున్న ఆయన.. తాజాగా తన రిసెప్షన్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. ఈ సందర్భంగా తన భార్యపై ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తూ ఓ నోట్‌ రాశారు. అది ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

‘నువ్వు కేవలం నా భార్యగా మాత్రమే కాదు.. నా ఇల్లు,  ప్రశాంతత, ప్రతిరోజూ నాకు ఇష్టమైన వ్యక్తిగా మారావు. నిన్ను నా జీవితంలోకి తీసుకొచ్చినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు. ప్రతి దశలో నిన్ను ప్రేమిస్తూ, నీకు అండగా ఉంటానని మాటిస్తున్నాను. మనం కలిసి నిర్మించబోయే అందమైన భవిష్యత్తు కోసం ఎదురుచూస్తున్నా’ అంటూ రాసుకొచ్చారు.

ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ‘అందమైన జంట.. మీ ఇద్దరూ ప్రేమతో, ఆనందంగా ఉండాలి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం మోహ్సిన్‌ను ట్రోల్‌ చేస్తున్నారు. గతంలో ఊర్మిళతో ఉన్న సమయంలోనూ ఇలాంటి హామీలే ఇచ్చి ఉంటారని కామెంట్లు చేస్తున్నారు. అసలు ఊర్మిళ, మోహ్సిన్‌ మధ్య ఏం జరిగిందని కొందరు ప్రశ్నిస్తున్నారు.

గతంలోనూ వైరల్‌..

మోహ్సిన్‌ తన రెండో పెళ్లి సమయంలోనూ సోషల్‌మీడియాలో ఓ ఆసక్తికరమైన పోస్ట్‌ పెట్టారు. ‘స్వచ్ఛమైన ఉద్దేశాలు, నిజమైన ప్రేమతో పాటు దేవుడి నిర్ణయాన్ని విశ్వసించాలి. సరైన సమయంలో నిధాను నా జీవితంలోకి తీసుకొచ్చారు. ఆమె నా జీవితంలో వెలుగులు నింపింది’ అని రాసుకొచ్చారు.

2016లో ఊర్మిళతో వివాహం..

ఊర్మిళ మటోండ్కర్‌, మోహ్సిన్‌ అక్తర్‌ మీర్‌ 2016 ఫిబ్రవరి 4న అత్యంత సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. వీరిది మతాంతర వివాహం కావడంతో పాటు.. ఇద్దరి మధ్య దాదాపు పదేళ్ల వయసు తేడా ఉండటంతో అప్పట్లో వార్తల్లో నిలిచారు. 2014లో ఓ వివాహ వేడుకలో ఊర్మిళను కలిసిన మోహ్సిన్‌.. ఆ తర్వాత ఆమెతో ప్రేమలో పడ్డారని సమాచారం. రెండేళ్ల తర్వాత వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.

Videos

భారతి సిమెంట్స్ కేసులో కూటమి ప్రభుత్వానికి గట్టి షాకిచ్చిన హైకోర్టు

చిరు NEXT మూవీ టైటిల్ లీక్.. వద్దు వద్దు అంటున్న ఆపుకోలేక నోరు జారిన చిరంజీవి

ఆ సీఐ చుట్టూ కూటమి రాజకీయం..!

LB నగర్ పీఎస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య

కేకును కోస్తే అరెస్ట్ చేసి నడి రోడ్డుపై నడిపించారు.. మెడికల్ విద్యార్థిని ప్రియాంకను చంపేస్తే మాత్రం వారిని

నేడు MLA, MLCలతో వైఎస్ జగన్ కీలక సమావేశం

నా కాలు విరిగినా.. నా ప్రాణం పోతాదన్నా జగనన్న కోసం ఎలాంటి కష్టానైనా...

EVM ట్యాపరింగ్ జరిగిందో లేదో చంద్రబాబే చెప్పాలి..! ఉండవల్లి అరుణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్

రాజమండ్రి పోలీసులు అందరూ ఎలాంటివారంటే..! డాక్టర్ ప్రియాంక ఘటనపై అడ్వకేట్ బాల కామెంట్స్

నా భర్తను అక్రమంగా అరెస్ట్ చేసి... సీదిరి అప్పలరాజు భార్య సంచలన వ్యాఖ్యలు

Photos

+5

హైదరాబాద్‌లో మొదలైన వినాయక చవితి 2026 సందడి (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌...(ఫొటోలు)

+5

‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ సెలబ్రేషన్స్‌...ముఖ్య అతిథిగా చిరంజీవి (ఫొటోలు)

+5

హాఫ్ శారీలో చిన్న పిల్లలా హీరోయిన్ నభా నటేశ (ఫొటోలు)

+5

ఫైరింగ్ కియారా.. అందం ఏ మాత్రం తగ్గలే (ఫొటోలు)

+5

ఐశ్వర్య రాజేశ్ ఇంతలా మారిపోయిందేంటి? (ఫొటోలు)

+5

యంగ్ హీరోతో నయన్ లవ్ పోజులు (ఫొటోలు)

+5

‘అగధ’ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం క్యూట్ ఫ్యామిలీ.. వెకేషన్ (ఫొటోలు)