Breaking News

మోహన్ లాల్‍ బర్త్‌ డే.. ఖరీదైన కారు కొనిచ్చిన ఫ్రెండ్!

Published on Mon, 05/22/2023 - 16:03

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌ లాల్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చాడు అతని ప్రాణ స్నేహితుడు. మే 21న ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఖరీదైన బహుమతి ఇచ్చి అభిమానం చాటుకున్నారు.  మోహన్ లాల్‌కు సరికొత్త కియా ఈవీ-6 ఎలక్ట్రిక్ కారును గిప్ట్‌గా ఇచ్చాడు. ఈ లగ్జరీ ఎస్‌యూవీ కారు విలువ దాదాపు రూ. 65 లక్షలకు పైగానే ఉంది. సూపర్ స్టార్ తన భార్యతో కలిసి కారు డెలివరీ తీసుకుంటున్న వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

(ఇది చదవండి: టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్‌ బాబు కన్నుమూత)

మోహన్ లాల్ ఆదివారం తన 63 వ పుట్టినరోజును జరుపుకున్నారు. తెలుగులోనూ పలు చిత్రాలో నటించారు. ఆయన తన పుట్టిన రోజును కొంతమంది నిరుపేద పిల్లల సమక్షంలో జరుపుకున్నారు. వారితో కాసేపు సరదా మాట్లాడి కేక్ కట్ చేశారు. అంతే కాకుండా 2019 వరద రెస్క్యూ ఆపరేషన్‌లో ప్రాణాలు కోల్పోయిన కోజికోడ్‌కు చెందిన వ్యక్తికి మోహన్‌లాల్ ఇంటిని కూడా విరాళంగా ఇచ్చారు.

(ఇది చదవండి: వెయిటర్‌గా మారిన 'బిచ్చగాడు' హీరో విజయ్‌ ఆంటోని)

కాగా.. మోహన్‌లాల్ ప్రస్తుతం 'మలైకోట్టై వాలిబన్'లో చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి లిజో జోస్ పెల్లిస్సేరీ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో మోహన్ లాల్ రాజస్థాన్‌కు చెందిన రెజ్లర్ పాత్రలో నటిస్తున్నారు. 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)