Breaking News

బిగ్గెస్ట్‌ డిజాస్టర్‌ చిత్రంగా 'వృషభ'.. నష్టం ఎన్నికోట్లు అంటే..

Published on Tue, 12/30/2025 - 10:43

మలయాళ ప్రముఖ నటుడు మోహన్‌లాల్‌కు ఈ ఏడాది బాగా కలిసొచ్చిందనుకుంటే.. తాజాగా విడుదలైన 'వృషభ' మూవీ  తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ డిజాస్టర్‌గా నిలిచింది. 2025 మోహన్‌లాల్‌ నటించిన లూసిఫర్‌ (ఎంపురాన్) రూ. 268 కోట్లు, తుడరమ్ రూ. 235 కోట్లు,  హృదయపూర్వం  రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరాయి. కానీ, ఈ ఏడాది చివరలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'వృషభ' భారీ నష్టాలను మిగిల్చింది.

క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 25న విడుదలైన 'వృషభ' మూవీ బాక్సాఫీస్‌ వద్ద 5రోజుల్లో రూ. 1.94 కోట్లు మాత్రమే వసూలు చేసింది. సుమారు రూ. 70 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీ దారుణమైన ఫలితాన్ని అందుకుంది. ఈ ఏడాది బిగ్గెస్ట్‌ డిజాస్టర్‌గా ఈ సినిమా ఉంది.  ప్రాంతాల వారిగా 5రోజుల కలెక్షన్స్‌ ఇలా ఉన్నాయి.  ఓవర్సీస్‌లో ఈ చిత్రం దాదాపు రూ. 25 లక్షలు,  మలయాళంలో రూ. 1.01 కోట్లు, హిందీలో  రూ. 8 లక్షలు, తెలుగు వెర్షన్  రూ. 32 లక్షలు, కన్నడ వెర్షన్  దాదాపు రూ. 4 లక్షలు మాత్రమే సాధించింది.  ఫైనల్‌గా ఈ మూవీ రూ. 65 కోట్లకు పైగానే నష్టాన్ని మిగల్చడం ఖాయంగానే కనిపిస్తుంది.

మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో దర్శకుడు నందకిషోర్‌ 'వృషభ' చిత్రాన్ని తెరకెక్కించారు. తండ్రీ కొడుకుల చుట్టూ తిరిగే జ‌న్మజన్మల కథగా ఈ మూవీ ఉంది. కొత్త‌ద‌నం లేని క‌థ‌తో ప్రేక్షకులకు విసుగు తెప్పించారని విమర్శలు ఉన్నాయి. ఇందులో కేవలం మోహన్‌లాల్‌ నటన మాత్రమే బాగుందని ప్రశంసలు వచ్చాయి. అజ‌య్‌, అలీ, అయ్య‌ప్ప పి.శ‌ర్మ వంటి తెలుగున‌టులు  ఈ మూవీలో  కీల‌క పాత్ర‌ల్లో క‌నిపిస్తారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)