Breaking News

ఓ సౌత్‌ ఇండియా సినిమా మూడు విదేశీ భాషల్లోకి..

Published on Fri, 09/17/2021 - 13:22

ఓ భాషలో హిట్‌ అయిన కథలను మరో భాషలో రీమేక్‌ చేయడం సినీ పరిశ్రమల్లో మాములుగా జరిగేదే. కానీ ఓ భారతీయ సినిమా విదేశీ భాషల్లో రీమేక్‌ అవడం మాత్రం అరుదనే చెప్పాలి. అది ఓ సౌత్‌ ఇండియన్‌ మూవీ అవడం చాలా తక్కువ.  ఇప్పుడు మాలయాళం సూపర్‌ హిట్‌ సినిమా ‘దృశ్యం’ త్వరలో ఇండోనేషియా లాంగ్వేజ్‌లోకి వెళ్లనుంది.

ఈ విషయాన్ని చిత్ర నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్ సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘మోహన్‌లాల్‌ హీరోగా, జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో రూపొందిన ‘దృశ్యం’ ఇప్పటి వరకు 4 భారతీయ భాషలు, 2 విదేశీ భాషల్లో రీమేకైంది. ఇండియన్‌ లాంగ్వేజేస్‌తోపాటు చైనీస్‌, శ్రీలంకన్‌ భాష​ల్లో విడుదలై మంచి స్పందన సొంతం చేసుకుంది. ఇప్పుడు ఇండోనేషియా భాషలో నిర్మితం కానుంది. ఇలా మా సినిమా సరిహద్దులను చెరిపేస్తూ దూసుకుపోవడం ఎంతో సంతోషాన్నిస్తోంది’ అని ఆంటోని తెలిపాడు. ఈ చిత్రాన్ని ఇండోనేషియాలో జకార్తాలోని పీటీ ఫాల్కన్ అనే సంస్థ నిర్మించనుంది. చైనీస్‌లో రీమేక్‌ అయిన మొదటి మలయాళ చిత్రం ఇదే కావడం విశేషం. 

చదవండి: దృశ్యం 2’ అరుదైన రికార్డు, ఇండియన్‌ సినిమాల్లో అత్యధిక రేటింగ్‌

కాగా, ఈ సినిమాకి సీక్వెల్‌గా వచ్చిన ‘దృశ్యం 2’  ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అయిన అమెజాన్‌లో ఈ ఫిబ్రవరి విడుదలై ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఈ చిత్రం కూడా తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో రీమేక్‌లు అవుతోంది.

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)