Breaking News

సెంచరీలతో స్టార్‌ హీరో దూకుడు.. మరో హాఫ్‌ సెంచరీ!

Published on Fri, 09/05/2025 - 13:18

ప్రేక్షకుల్ని మెప్పించడం, వరుస విజయాలు అందుకోవడం అంత ఈజీ కాదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడుతుంటారు. కానీ ఈ సీనియర్‌ హీరో మాత్రం అదంతా తనకు మామూలు విషయం అన్నట్లుగా వరుస హిట్లతో స్పీడుమీదున్నాడు. ఆయనే మలయాళ స్టార్‌ మోహన్‌లాల్‌ (Mohanlal). 

2025లో ఇప్పటివరకు మూడు హిట్స్‌
మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్‌ చిత్రం హృదయపూర్వం.  సత్యన్‌ అంతికడ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ రూ.50 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్‌ వెల్లడించింది. దీనికంటే ముందు మోహన్‌లాల్‌ ఈ ఏడాది ఎంపురాన్‌ (లూసిఫర్‌ సీక్వెల్‌), తుడరుమ్‌ సినిమాలతో పలకరించాడు. ఈ రెండు కూడా మంచి విజయాలే అందుకున్నాయి. కేవలం రూ.28 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన తుడరుమ్‌ ఏకంగా రూ.230 కోట్లు వసూలు చేసింది. 

హృదయపూర్వం సినిమా స్టిల్‌

మలయాళ ఇండస్ట్రీలోనే అత్యధికం
రూ.150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఎంపురాన్‌ ఏకంగా రూ.260 కోట్లు సాధించింది. మలయాళ చరిత్రలోనే రూ.250 కోట్లు దాటిన మొట్టమొదటి చిత్రంగా ఎంపురాన్‌ రికార్డు సృష్టించింది. ఓపక్క హీరోలు ఒక్క హిట్టు కోసం పరితపిస్తుంటే.. మోహన్‌లాల్‌ మాత్రం కేవలం ఆరు నెలల్లోనే వరుసగా మూడు హిట్లు సాధించి అందరూ ఆశ్చర్యపోయేలా చేశాడు.

నెక్స్ట్‌ ఏంటి?
మోహన్‌లాల్‌ నెక్స్ట్‌ మూవీ ‘వృషభ’ ఈ ఏడాది అక్టోబరు 16న రిలీజ్‌ కానుంది. ఇందులో హీరో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ మేక కీలక పాత్ర పోషించాడు. ఈ పాన్‌ ఇండియా సినిమాకు నందకిశోర్‌ దర్శకత్వం వహించారు. అలాగే సూపర్‌ హిట్‌ థ్రిల్లర్‌ ఫ్రాంచైజీ 'దృశ్యం పార్ట్‌ 3'లోనూ మోహన్‌లాల్‌ భాగం కానున్నాడు. ఈ మూవీ వచ్చే నెలలోనే ప్రారంభం కానుంది.

 

 

చదవండి: మజిలీ తర్వాత మారిపోయా.. లవ్‌స్టోరీ మిస్సవుతున్నా..

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)