Breaking News

నగల యాడ్‌ హీరోయిన్లే చేయాలా ఏంటి..?

Published on Sat, 07/19/2025 - 12:22

మలయాళ టాప్‌ హీరో మోహన్ లాల్ నటనకు ప్రేక్షకుల నుంచే కాకుండా విమర్శకుల కూడా ప్రశంసలు కురిపిస్తారు. మరోసారి తనను భారతీయ సినిమా చరిత్రలో అత్యుత్తమ నటుడిగా ఎందుకు భావిస్తున్నారో నిరూపించుకున్నారు. తాజాగా ఆయన నటించిన బంగారు ఆభరణాల ప్రకటన నెట్టింట వైరల్అవుతుంది. సాధారణంగా బంగారు అభరణాలకు సంబంధించిన యాడ్స్లలో హీరోయిన్లు ఎక్కువగా కనిపిస్తారు. అయితే, ఈ దిగ్గజ నటుడు కనీసం ఒక్క డైలాగ్ కూడా లేకుండా ప్రేక్షకులను మెప్పించాడు. కేవలం తన నటనతోనే ఆశ్చర్యపరిచాడు. ఈ వాణిజ్య ప్రకటనలో పూర్తిగా అతని కళ్ళు, హావభావాలు మాత్రమే పలికించాడు. అదరహో అనిపించేలా మోహన్ లాల్ కనిపిస్తాడు.

'తుడరుమ్' చిత్రంలో మోహన్ లాల్తో కలిసి నటించిన, ప్రఖ్యాత యాడ్ ఫిల్మ్ మేకర్ ప్రకాష్ వర్మ దర్శకత్వం వహించిన ఈ వాణిజ్య ప్రకటన 110 సెకన్ల నిడివితో ఉంది. మోహన్ లాల్ కారు దిగగానే.. సెట్లో ఉన్న ప్రకాష్ స్వాగతం పలుకుతాడు. 'మేము దీనిని ఫ్యాషన్ ఫోటోగ్రఫీ శైలిలో చిత్రీకరించాము' అంటూ మోడల్ శివానీని మోహనల్లాక్కు పరిచయం చేస్తాడు. యాడ్కోసం ఆమె ధరించిన వజ్రాల ఆభరణాన్ని ఎవరికీ చెప్పకుండా మోహన్ లాల్ తీసుకుని తన వానిటీ వ్యాన్లోకి తీసుకెళ్తాడు. అద్దం ముందు నిలబడి తన మెడలో వజ్రాల అభరణాన్ని ఆయన ధరిస్తాడు. సమయంలో ఆయన పలికించే హావభావాలు అందరినీ ఆకట్టుకుంటాయి.

ఇలా కేవలం మోహన్లాల్మాత్రమే నటించగలరని నెటిజన్లు అభినందిస్తున్నారు. నగలకు సంబంధించిన వాణిజ్య ప్రకటనలలో హీరోయిన్లే కనిపించాలా ఏంటి...? అంటూ మరోకరు చెప్పుకొచ్చారు. ఇలా స్త్రీ హావభావాలు పలికించడం చాలా కష్టం.. కానీ, మోహన్లాల్చాలా సులువుగా మెప్పించారు. దటీజ్‌ మోహన్‌లాల్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అందుకే ఆయన జాతీయ నటుడు అయ్యారు అంటూ ప్రసంశలు కురిపిస్తున్నారు

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)