Breaking News

బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ కొన్న ఏకైక భారతీయ నటుడు.. రేటు ఎంతంటే?

Published on Tue, 06/10/2025 - 13:22

ఇప్పుడంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. ఒక భాషకు చెందిన హీరోలు.. ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అయితే ఇలాంటివి ఏం లేని టైంలోనే దేశవ్యాప్తంగా ఫేమ్ సొంతం చేసుకున్న కొందరు నటీనటులు ఉన్నారు. వాళ్లలో మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ ఒకరు. ఈయనకు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన కట్టడంలో ఓ ఫ్లాట్ ఉందనే విషయం మీలో ఎంతమందికి తెలుసు?

(ఇదీ చదవండి: త్రివిక్రమ్ లాంటి దర్శకుడికి ఇలాంటి పరిస్థితా?)

దుబాయిలో బుర్జ్ ఖలీఫా గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అక్కడికి వెళ్లిన ప్రతి  పర్యాటకుడు దీన్ని సందర్శించకుండా తిరిగిరాడు. అలాంటిది ఈ ఎత్తయిన కట్టడంలోని 29వ ఫ్లోర్‌లో సింగిల్ బెడ్ రూమ్‌ని చాన్నాళ్ల క్రితమే మోహన్ లాల్ కొనుగోలు చేశారు. దాదాపు రూ.3.5 కోట్లు పెట్టి దీన్ని సొంతం చేసుకున్నారు. కాకపోతే దీన్ని తన భార్య సుచిత్ర పేరిట రిజిస్టర్ చేయించారు. దీనితో పాటు దుబాయిలోనే పెద్ద విల్లాలోని 3 బీహెచ్‌కే ఫ్లాట్ కూడా మోహన్ లాల్ కొన్నారు.

ఇలా బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ కొన్న ఏకైక నటుడిగా మోహన్ లాల్ రికార్డ్ సృష్టించారనే చెప్పాలి. తెలుగు నటుల్లోనూ మహేశ్ బాబు, అల్లు అర్జున్‌కి కూడా దుబాయిలో అపార్ట్‌మెంట్స్ కొనుగోలు చేశారనే గతంలో రూమర్స్ వచ్చాయి. కానీ వీటిపై క్లారిటీ రావాల్సి ఉంది. గత కొన్నాళ్లుగా చూసుకుంటే మాత్రం దుబాయిలో టూరిజం బాగా పెరిగింది. దీంతో మనదేశానికి చెందిన పలువురు కోటీశ్వరులు, సెలబ్రిటీలు అక్కడ అపార్ట్ మెంట్స్ కొనుగోలు చేస్తున్నారు.

మోహన్ లాల్ సినిమాల విషయానికొస్తే.. ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్' సినిమాలో నటించడంతో ఈ తరం ఆడియెన్స్‌కి పరిచమయ్యారు. రీసెంట్ టైంలో ఎల్ 2 ఎంపురాన్, తుడరమ్ చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించారు. ఈయన కొడుకు ప్రణవ్ కూడా హీరోగా మలయాళంలో పలు చిత్రాలు చేస్తున్నాడు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి కాంట్రవర్సీ సినిమా.. తెలుగులోనూ)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)