Breaking News

మోహన్‌లాల్‌తోనే పుట్టినరోజు.. ఆ రెండు కోరికలు తీరకుండానే మృతి

Published on Mon, 10/19/2026 - 18:06

మలయాళ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో చిత్ర ఒకరు. మమ్ముట్టి కథానాయకుడిగా నటించిన ‘అమరం’ సినిమాతో పాటు ఎన్నో చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. మోహన్‌లాల్‌కు కథానాయికగా పరిచయమయ్యారు. ఇలా నటిగా ఎన్నో విజయాలు అందుకున్నారు. ఇది ఇలా ఉంటే ఆమె మరణానికి కొన్ని గంటల ముందు స్నేహితురాలికి చేసిన ఫోన్‌ కాల్‌పై అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. అసలు ఈమె ఎవరో ఏంటో ఒకసారి తెలుసుకుందాం!

మోహన్‌లాల్‌తో ఒకే పుట్టినరోజు
చిత్ర అసలు పేరు శ్రుతి చిత్ర. కొచ్చిలో జన్మించిన ఆమె తండ్రి రైల్వే ఇంజినీర్‌గా పనిచేసేవారు. చిత్ర చిన్నతనంలోనే సినిమాల్లోకి అడుగుపెట్టారు. 1983లో విడుదలైన ‘ఆట్టకలాశం’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమయ్యారు. ఈ సినిమాలో మోహన్‌లాల్‌కు జోడీగా నటించారు. తొలి సినిమా విజయంతో ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. చిత్ర, మోహన్‌లాల్‌ ఇద్దరూ మే 21నే జన్మించారు.

తెలుగులో..
మలయాళంతో పాటు తమిళం, తెలుగు, కన్నడ చిత్రాల్లోనూ చిత్ర నటించారు. అమావాస్య చంద్రుడు (1981) కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ క్లాసిక్ సినిమాలో సులోచన అనే పాత్రను పోషించారు. అంతేకాకుండా ‘గాజు బొమ్మలు’, ‘పదహారేళ్ల అమ్మాయి’, ‘నేటి స్వాతంత్ర్యo’ ‘ఇంద్ర ధనస్సు’ ‘చట్టంతో చదరంగం’ ‘ప్రేమించాక’ వంటి తదితర తెలుగు చిత్రాల్లో నటించారు.

నెరవేరని రెండు కోరికలు
2021 ఆగస్టు 21న చెన్నైలోని తన నివాసంలో గుండెపోటుతో చిత్ర కన్నుమూశారు. అప్పటికి ఆమె వయసు 56 ఏళ్లు. ఉత్తమ నటిగా రాష్ట్ర పురస్కారం అందుకోవాలన్నది ఆమె పెద్ద కోరికల్లో ఒకటి. అలాగే ప్రముఖ దర్శకుడు ఫాజిల్‌ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించాలని ఆశపడ్డారు. ఈ మేరకు పలు ఇంటర్వ్యూలో తెలిపారు. కానీ ఆ రెండు కోరికలు నెరవేరకుండానే ఆమె కన్నుమూశారు.

ఆ నాలుగు గంటల ముందు..
చిత్ర మరణం తర్వాత ఆమె సన్నిహితురాలు, నటి కుట్టి పద్మిని పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మృతికి సుమారు నాలుగు గంటల ముందు చిత్ర ఆమెకు ఫోన్‌ చేసి తన కుమార్తెను జాగ్రత్తగా చూసుకోవాలని కోరిందట. ఈ విషయం అప్పట్లో పెద్ద చర్చనీయాంశం అయింది. కాగా చిత్ర మరణంతో ఆమె భర్త విజయరాఘవన్‌ తీవ్ర మనోవేదనకు గురయ్యారని, ఆయన కూడా దాదాపు నెల రోజులకే కన్నుమూశారని సమాచారం. ప్రస్తుతం వారి కుమార్తె మహాలక్ష్మి బాధ్యతలను కుట్టి పద్మిని, నటి శరణ్య పొన్నవన్నన్‌ చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

ఇదిలా ఉండగా.. 1990లో వ్యాపారవేత్త విజయరాఘవన్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరికి మహాలక్ష్మి అనే కుమార్తె జన్మించింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఆమె.. కొంతకాలానికి మళ్లీ నటనలోకి వచ్చారు. అయితే తొలి దశలో వచ్చినంత గుర్తింపు రెండో ఇన్నింగ్స్‌లో దక్కలేదు.

(ఇదీ చదవండి: గరివిడి లక్ష్మి.. ‘పికిలి పిట్టకు పీక సన్నము’ పాట అర్థం ఇదే!)

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)