మోహన్‌ లాల్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ 'బరోజ్' విడుదల తేదీ ప్రకటన

Published on Sat, 08/17/2024 - 20:23

ప్రముఖ నటుడు మోహన్‌ లాల్‌ తన విలక్షణ నటనతో ఎందరినో ఆకట్టుకున్నారు. అయితే, తొలిసారిగా దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న ఫాంటసీ చిత్రం ‘బరోజ్’. సుమారు నాలుగేళ్ల క్రితమే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ ను ఆపేశారు. కానీ, ఈ చిత్రం షూటింగ్‌ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించే సమయానికి మోహన్ లాల్ అప్పటికే కమిట్ అయిన సినిమాల నుంచి ఒత్తిడి వచ్చింది దీంతో బరోజ్‌  షూటింగ్ పనులు చాలా నెమ్మదిగా సాగాయి.

తాజాగా మోహన్‌ లాల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా బరోజ్‌ గురించి అప్‌డేట్‌ ఇచ్చారు. 'బరోజ్' తన రహస్యాలను 3 అక్టోబర్ 2024న వెల్లడించడానికి వస్తున్నాడని విడుదల తేదీని ప్రకటించారు. అద్భుత సాహసం కోసం మీ క్యాలెండర్‌లో ఆ తేదీని నోట్‌ చేసుకోండి.' అంటూ మోహన్‌ లాల్‌ తెలిపారు. తాజాగా విడుదలైన పోస్టర్‌లో మోహన్‌ లాల్‌ గుండు, గుబురు గడ్డంతో ఉన్నారు. అలాగే ఈ సినిమాను త్రీడీ విధానంలో చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. ఇండియాలోనే మొదటి త్రీడీ చిత్రం మై డియర్‌ కుట్టిచాతన్‌కు దర్శకత్వం వహించిన జిజో పున్నూస్‌ కథను అందించారు. సినిమాటోగ్రాఫర్‌గా సంతోష్‌ శివన్‌ పనిచేశారు. 

వాస్కోడిగామా నిధిని కాపాడే జినీగా మోహన్‌ లాల్‌ నటిస్తున్నాడు.  వాస్కోడి‌గామాకి చెందిన అపార సంపద (బంగారం,వజ్రాలు) బరోజ్ అనే ఒక భూతం 400 ఏళ్ళగా కాపాడుతూ వస్తుంది. ఆయనకు సంబంధించిన నిజమైన వారసులకు ఆ సంపదని అప్పగించాలని ఆ భూతం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ కాన్సెప్ట్‌తో సినిమా ఉండనుంది. తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా 'బరోజ్' చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ ఆశీర్వాద్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆయన నిర్మిస్తున్నారు. ఆంటోనీ పెరుంబావూర్ నిర్మాతగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్‌ 3న తెలుగు,హిందీ,తమిల్‌,కన్నడ,మలయాళంలో బరోజ్‌ సినిమా విడుదల కానుంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)