Breaking News

మోహన్ లాల్ డ్రీమ్ ప్రాజెక్ట్.. 3డీ ట్రైలర్ చూశారా?

Published on Wed, 12/11/2024 - 16:58

మలయాళ స్టార్‌ హీరో మోహన్‌ లాల్‌ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తోన్న చిత్రం 'బరోజ్‌: గార్డియన్‌ ఆఫ్‌ ట్రెజర్స్‌'. ఈ మూవీని తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తున్నారు. తన సొంత నిర్మాణ సంస్థ ఆశీర్వాద్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ మూవీని ఆయన నిర్మిస్తున్నారు. ఆంటోనీ పెరుంబావూర్ నిర్మాతగా ఉన్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి హిందీ ట్రైలర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఇప్పటికే మలయాళంలో ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే.

మైథలాజికల్‌ థ్రిల్లర్‌గా జీజో పున్నూసే రచించిన నవల ఆధారంగా బరోజ్‌ చిత్రాన్ని తెరకెక్కించారు. వాస్కోడిగామాలో దాగి ఉన్న నిధిని 400 ఏళ్లుగా కాపాడే జినీగా మోహన్‌ లాల్‌ కనిపించనున్నాడు. అయితే ఆ సంపదను ఆయన ఎందుకు రక్షిస్తున్నాడు. చివరగా దానిని ఎవరికి అందించాలని ఆయన ప్రయత్నం చేస్తాడనేది ఈ చిత్ర కథగా తెలుస్తోంది. ఈ మూవీని తొలిసారిగా 3డీ వర్షన్‌లో తెరకెక్కించారు. భారీ వీఎఫ్‌ఎక్స్‌తో నిర్మించిన ఈ చిత్రం పాన్‌ ఇండియా రేంజ్‌లో  క్రిస్మస్‌ కానుకగా ఈ డిసెంబరు 25న విడుదల కానుంది. 

అయితే హిందీ వర్షన్ మాత్రం డిసెంబర్‌ 27న రిలీజ్ చేయనున్నట్లు మోహన్ లాల్ ట్వీట్ చేశారు. బాలీవుడ్‌లో పెన్ స్టూడియోస్ సహకారంతో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. కానీ వాస్తవంగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్‌ 3న విడుదల చేయాలని ఇది వరకే ప్రకటించారు. కానీ, నిర్మాణంతర పనులు పెండింగ్‌ ఉండటం వల్ల విడుదల ఆలస్యమైంది.  మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, ఈ మూవీ రిలీజ్‌ కానుంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)