మోహన్‌లాల్‌ రికార్డ్‌.. ఒకే ఏడాదిలో రూ. 600 కోట్లు

Published on Thu, 09/25/2025 - 09:35

మలయాళ ప్రముఖ నటుడు మోహన్‌లాల్‌ (Mohanlal)కు ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. తాజాగా తను నటించిన చిత్రం హృదయపూర్వం (Hridayapoorvam) రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరింది. సత్యన్‌ అంతికాడ్‌ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్‌ కామెడీ డ్రామాకు మలయాళ అభిమానులు ఫిదా అయ్యారు. మాళవికా మోహనన్‌, ‘ప్రేమలు’ ఫేమ్‌ సంగీత్‌ ప్రతాప్‌ కీలక పాత్రలలో నటించిన  ఈ సినిమా ఆగస్టు 28న  విడుదలైంది. సెప్టెంబర్‌ 26న  ‘జియో హాట్‌స్టార్‌’ (Jio Hotstar)లో  స్ట్రీమింగ్‌కు కూడా రానుంది.

ఎంతో ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డును రీసెంట్‌గా మెహన్‌లాల్‌ అందుకున్నారు. ఆపై ఇదే ఏడాదిలో ఆయన నటించిన మూడు చిత్రాలు రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరాయి. దీంతో ఆయన అభిమానులు సంతోషంలో ఉన్నారు. 2025 మోహన్‌లాల్‌కు బాగా కలిసొచ్చిన ఏడాదిగా ఎప్పటికీ మిగిలిపోతుందని పేర్కొంటున్నారు. లూసిఫర్‌ (ఎంపురాన్) రూ. 268 కోట్లు, తుడరమ్ రూ. 235 కోట్ల మేరకు కలెక్ట్‌ చేశాయి. తాజాగా హృదయపూర్వం చిత్రం కూడా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరింది.

మలయాళ పరిశ్రమలో ఒకే ఏడాదిలో వంద కోట్ల మార్క్‌ను ఏకంగా మూడు చిత్రాలకు అందుకున్న నటుడిగా లాల్‌కు గుర్తింపు దక్కింది. ఆపై ఒక ఏడాదిలో చిత్రపరిశ్రమలో  రూ. 600 కోట్లకు పైగా మార్కెట్‌ను క్రియేట్‌ చేసిన నటుడిగా గుర్తింపు పొందారు. దర్శకుడు సత్యన్ అంతికాడ్‌తో సుమారు పదేళ్ల తర్వాత మోహన్‌లాల్‌ కలిసి పనిచేశారు.  దర్శకుడిగా ఆయనకు వంద కోట్ల సినిమా కూడా ఇదే కావడం విశేషం.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)