Breaking News

'ఈ ఘనత అంతా మీవల్లే'.. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్‌పై మోహన్‌లాల్

Published on Sun, 09/21/2025 - 08:59

సినీ రంగంలో అందించే అత్యుత్తమ అవార్డ్‌ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ రావడంపై మోహన్ లాల్ స్పందించారు. ఈ అవార్డ్ అందుకోవడం నిజంగా గౌరవంగా ఉందన్నారు. అయితే ఈ విజయం నా ఒక్కడిది కాదు.. నా వెంట నడిచిన ప్రతి ఒక్కరికీ ఈ ఘనత దక్కుతుందని ట్వీట్ చేశారు. నా కుటుంబం, అభిమానులు, సహచరనటులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల ప్రేమ వల్లే ఈ రోజు నాకు అవార్డ్ దక్కిందన్నారు. ఈ గుర్తింపుతో నా హృదయం నిండిపోయిందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా.. 2023 ఏడాదికి గానూ మలయాళ సూపర్ స్టార్‌ మోహన్‌ లాల్‌కు కేంద్రం దాదా సాహెబ్ అవార్డ్ ప్రకటించింది. సెప్టెంబర్ 23న జరిగే జాతీయ సినీ అవార్డుల కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని మోహన్ లాల్‌కు అందజేయనున్నారు.


కాగా.. 1980లో సినిమాల్లో అడుగుపెట్టిన మోహన్ లాల్ దాదాపు 350కి పైగా సినిమాల్లో నటించారు. మంజిల్‌ విరింజ పూక్కళ్‌ అనే చిత్రంతో మలయాళ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. దాదాపు 45 ఏళ్ల తన సినీ కెరీర్‌లో మలయాళంతోపాటు తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లోనూ నటించారు. తెలుగులో జనతా గ్యారేజ్ మూవీతో ఫేమ్ తెచ్చుకున్న మోహన్ లాల్.. కంప్లీట్ యాక్టర్‌ అనే పేరును సంపాదించుకున్నారు. తాజాగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్‌ ప్రకటనతో ఆయన నట సామర్థ్యానికి తగిన గౌరవం దక్కిందని సినీ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)