Breaking News

ఓటీటీకి మోహన్ లాల్ ఫాంటసీ మూవీ.. పార్ట్‌నర్‌ ఫిక్స్

Published on Thu, 01/16/2025 - 20:53

మలయాళీ స్టార్ మోహన్‌లాల్(Mohan Lal) నటించిన లేటేస్ట్ మూవీ 'బరోజ్ 3డీ'(Barroz 3D Movie). ఈ సినిమాకు ఆయన దర్శకత్వం వహించారు.  ఈ ఎపిక్‌ డ్రామా ఫాంటసీ సినిమాని ఆశీర్వాద్‌ సినిమాస్‌ పతాకంపై ఆంటోని పెరుంబవూర్‌ నిర్మించారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమా తెలుగులో రిలీజ్ చేశారు. గతేడాది క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 25న థియేటర్లలో సందడి  చేసిన ఈ చిత్రం అభిమానులను అంతగా మెప్పించలేకపోయింది.

తాజాగా ఈ మూవీ ఓటీటీకి(OTT) వచ్చేందుకు సిద్ధమైంది. త్వరలోనే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుందని ఓటీటీ సంస్థ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. కాగా.. బరోజ్‌ కథ నచ్చడంతో తొలిసారిగా మోహన్‌లాల్‌ దర్శకత్వం వహించారు. వాస్కోడిగామా నిధిని కాపాడే జినీగా మోహన్‌ లాల్‌ ఈ చిత్రంలో కనిపించారు.

(ఇది చదవండి: 'బరోజ్ 3డీ’లో కొత్త ప్రపంచాన్ని చూస్తారు: మోహన్‌ లాల్‌)

బరోజ్ 3డీ కథేంటంటే.. 

ఒకప్పుడు గోవాని పాలించిన పోర్చుగీస్ రాజు డి గామా (ఇగ్నాసియో మతయోస్)కు బరోజ్ (మోహన్ లాల్) నమ్మిన బంటు. ఆయన నిధిని అంతా బరోజ్ కాపాడుతూ ఉంటాడు. భూతంలా మారి వాళ్ల వంశస్థులకు ఇదంతా అప్పగించేందుకు గత 400 ఏళ్లుగా కాపాలా కాస్తూనే ఉంటాడు. అలా వాస్కోడి‌గామా వంశంలోని 13వ జనరేషన్‌కి చెందిన ఇసబెల్లా (మాయా రావ్) గోవా వస్తుంది. ఆమె బరోజ్‌ని శాపవిముక్తుడిని చేస్తుంది. ఇసబెల్లాకు బరోజ్ నిధి అ‍ప్పగించాడా లేదా? 400 ఏళ్ల పాటు నిధిని కాపాడుకునే క్రమంలో బరోజ్ ఎన్ని అడ్డంకులు ఎదుర్కొన్నాడు? ఇసబెల్లాకు మాత్రమే బరోజ్ ఎందుకు కనిపిస్తాడు? చివరకు ఏమైందనేదే స్టోరీ. 

 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)