Breaking News

సీఎంను సామాన్యుడు కిడ్నాప్ చేస్తే?.. భ.. భ.. బ మూవీ రివ్యూ

Published on Sun, 02/01/2026 - 07:37

టైటిల్: భ.. భ.. బ..(భయం .. భక్తి .. బహుమానం)

విడుదల తేదీ: 2026-01-27

నటీనటులు: దిలీప్, మోహన్‌లాల్, వినీత్ శ్రీనివాస్, ధ్యాన్ శ్రీనివాసన్, బైజు సంతోష్, శాండీ తదితరులు

దర్శకుడు: ధనంజయ్ శంకర్

నిర్మాణం సంస్థ: శ్రీ గోకులం మూవీస్

సంగీతం: గోపీ సుందర్

ఓటీటీ: జీ5

ఓటీటీల్లో మలయాళ సినిమాలకు మంచి డిమాండ్ ఉంటోంది. అందుకే అక్కడ హిట్ సినిమాలను తెలుగు ఆడియన్స్‌ కోసం డబ్‌ చేసి వదులుతున్నారు. ముఖ్యంగా మోహన్‌ లాల్‌కు టాలీవుడ్‌లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. అందువల్లే ఆయన కీలక పాత్రలో మెప్పించిన భా భా బ అనే మూవీని తెలుగులోనూ స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చారు. ఆ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

అసలు కథేంటంటే..

ఒక పిల్లవాడు తన చిన్నతనంలో తల్లిదండ్రులను కోల్పోతాడు. తన తండ్రిని ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో సీఎం కాన్వాయ్‌ వల్ల ఆలస్యమై ప్రాణాలు పోతాయి. అప్పటి నుంచే సీఎంపై కక్ష పెంచుకున్న పిల్లవాడు.. పెద్దయ్యాక తన రివేంజ్‌ తీర్చుకున్నాడా? ఎలాంటి ఆధారం లేని ఆ పిల్లవాడు సీఎంను ఏం కిడ్నాప్ చేశాడా? తన పగ తీర్చుకున్నాడా? అన్నదే భా.. భా.. భా.. కథ.

ఎలా ఉందంటే..

ఒక సీఎం కాన్వాయ్ వల్ల తన తండ్రి కోల్పోయిన రాడార్ (దిలీప్) తన రివేంజ్ కోసం ముఖ్యమంత్రి జోసెఫ్ (బైజు సంతోష్)నే కిడ్నాప్ చేస్తాడు.  అయితే సీఎం కుమారుడైన నోబుల్ (వినీత్ శ్రీనివాసన్) ఎన్‌ఐఏ ఎజెంట్‌గా పనిచేస్తుంటాడు. తన తండ్రి కోసం కుమారుడే రంగంలోకి దిగుతాడు. అయితే ఈ కథను డైరెక్టర్ చిన్న పిల్లలతో ప్రారంభించాడు. రెండు చిన్న పిల్లల క్రికెట్‌ టీమ్‌ల మధ్య మాటలతో కథ బ్యాక్‌డ్రాప్‌లోకి తీసుకెళ్లాడు. ఆడియన్స్‌లో ఆసక్తి పెంచేందుకు  అయితే సీఎం ఓ సభకు హాజరు కాగా.. రాడార్‌ చాలా సులువుగా కిడ్నాప్ చేస్తాడు. ఆ తర్వాత కథ చాలా ఫన్నీగా సాగుతుంది. రాడార్ ఎవరికీ దొరక్కుండా తప్పించుకునే సీన్స్‌ ప్రేక్షకులను ‍అలరిస్తాయి. తన తండ్రి కిడ్నాప్ ‍చేసిన వారిని పట్టుకునేందుకు నోబుల్ (వినీత్ శ్రీనివాసన్) విశ్వ ప్రయత్నాలు చేస్తుంటాడు. అలా ఫస్ట్‌ హాఫ్‌ ముగుస్తుంది.


అయితే తన తండ్రిని  కిడ్నాప్ చేసింది 'రాడార్' (దిలీప్) అనే విషయం నోబుల్‌కి తెలుస్తుంది. ఆ తర్వాత కథనం స్పీడ్‌గా వెళ్తుంది. అంతేకాకుండా రాడార్‌కి.. ఢిల్లీ బాల (మోహన్ లాల్)తో సంబంధాలు ఉన్నాయనే విషయం కూడా తెలుస్తుంది. మోహన్ లాల్ ఎంట్రీతో కథ చాలా ఇంట్రెస్టింగ్‌ మారుతుంది. మోహన్ లాల్, రాడార్‌ కలిసి చేసే ఫైట్స్ ఆడియన్స్‌ను అలరిస్తాయి. క్లైమాక్స్‌ సీన్‌ అద్భుతంగా అనిపిస్తుంది. అడవుల్లో ఫైరింగ్ స్టంట్స్‌ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. చివరి అరగంట మాత్రమే ఆడియన్స్‌ను కుర్చీలో కట్టిపడేలా చేస్తుంది. ఓ సామాన్యుడు తలచుకుంటే సీఎంను కూడా ముప్పు తిప్పలు పెట్టగలడు అనేది డైరెక్టర్‌ ఈ చిత్రంలో  చూపించారు. కాన్సెప్ట్‌ బాగుంది కానీ.. అందుకు తగినట్లుగా క్యూరియాసిటీ పెంచడంతో డైరెక్టర్ ఫెయిలయ్యాడనే చెప్పాలి. ఎప్పటికప్పుడు అన్నీ రివీల్ చేస్తూ వెళ్లడం మైనస్. కథలో ట్విస్ట్‌లు లేకపోవడంతో ప్రేక్షకుడికి ఇంట్రెస్టింగ్‌గా అనిపించదు.

అంతేకాకుండా మోహన్ ‍లాల్ స్థాయికి ఈ కథ సెట్ అవ్వలేదని చెప్పాలి. ఎందుకంటే ఓ స్టార్ హీరో సినిమా మధ్యలో ఎంట్రీ ఇవ్వడం అంతగా ఆసక్తిగా అనిపించకపోవచ్చు. స్టార్‌ ఇమేజ్‌కు తగినట్లుగా కథ లేకపోవడం ఇందులో పెద్ద మైనస్. దిలీప్, మోహన్ లాల్ లాంటి స్టార్స్‌ ఇలాంటి కథను చేయడం ఆడియన్స్‌కు ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పొచ్చు. ఈ వీకెండ్‌లో ఓ రివేంజ్ స్టోరీ చూడాలనుకుంటే భ.. భ.. బ ట్రై చేయొచ్చు. 

ఎవరెలా చేశారంటే..

ఈ సినిమాలో దిలీప్ పాత్రనే ఎక్కువ. మూవీ మొత్తం దిలీప్‌ తన నటనతో ఏ మాత్రం తగ్గకుండా చేశాడు. బైజు సంతోష్ సీఎం పాత్రలో ఒదిగిపోయారు. మోహన్ లాల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనలేదు. సినిమా మధ్యలో ఎంట్రీ ఇ‍చ్చినా తన నటనతో మరోసారి ఆడియన్స్‌ను మెప్పించాడు. సంగీతం ఫర్వాలేదు. సినిమాటోగ్రఫీ పరంగా చూస్తే విజువల్స్ కథకు తగ్గట్టుగానే గ్రాండ్‌గా ఉన్నాయి. ఎడిటింగ్‌లో ఇంకాస్తా కట్ చేస్తే బాగుండేది. నిర్మాణ విలువలు స్థాయికి తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. 
 

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)