Breaking News

'నిన్నే బాగా చూసుకున్నా.. కానీ నా గుండెలపై తన్నావ్': మోహన్ బాబు ఆవేదన

Published on Tue, 12/10/2024 - 20:48

ఫ్యామిలీ వివాదం మరింత ముదరడంతో మోహన్ బాబు స్పందించారు. తన ఇంటివద్ద పరిస్థితి ఉద్రిక్తతు దారితీయడంతో ఆయన మాట్లాడారు. ఈ విషయంపై మోహన్ బాబు ఆడియో విడుదల చేశారు. అందరికంటే ఎక్కువగా మనోజ్‌నే గారాబంగా పెంచినట్లు తెలిపారు. మనోజ్ వ్యవహరిస్తున్న తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. 

అందరికంటే బాగా చూసుకున్నా..

మోహన్ బాబు మాట్లాడుతూ..' మనోజ్ నిన్ను ఎంతో గారాబంగా పెంచాను.  అందరికంటే నిన్నే బాగా చూసుకున్నా. కానీ ఈ రోజు నా గుండెల మీద తన్నావు. నీకే ఎక్కువ ఖర్చుపెట్టి చదివించాలని ప్రయత్నించాను. నువ్వు ఏది అడిగినా నీకు ఇచ్చాను. కానీ ఈ రోజు నా మనసు ఆవేదనకు గురైంది. ప్రతి కుటుంబంలో ఇలాంటి సమస్యలు ఉంటాయి. నీవల్ల ఈ రోజు మీ అమ్మ ఆస్పత్రిలో చేరింది. నీ ప్రవర్తన చూసి మీ అమ్మ ఏడుస్తోంది. జల్‌పల్లి ఇల్లు నా కష్టార్జితం.. నీకు ఎలాంటి సంబంధం లేదు. కానీ ఇప్పుడు నువ్వు మద్యానికి బానిసై ఇలా ప్రవర్తిస్తావా? మన విద్యాలయాల్లో ఎంతమంది గొప్పవాళ్లుగా ఎదిగారు. నువ్వు నటుడిగా ఎంతో గొప్పవాడిగా ఎదిగావ్. నువ్వు మన పనివాళ్లపై ఎందుకు దాడి చేస్తున్నావ్. నేను ఇంట్లో లేనప్పుడు నువ్వు ఎందుకిలా చేస్తున్నావ్? నా ఆస్తి ఎవరికీ ఇవ్వాలన్నది నా ఇష్టం. ఒకప్పుడు నువ్వు నాకు ఏమి వద్దు అన్నావ్? మరీ ఈ రోజు ఎందుకిలా చేస్తున్నావ్? నువ్వు నా పరువు, ప్రఖ్యాతులు మంటగలిపావ్'  అని ఆవేదన వ్యక్తం చేశారు.

మోహన్ బాబు సంచలన ఆడియో లీక్..!

(ఇది చదవండి: మోహన్ బాబు ఇంటి వద్ద హై టెన్షన్.. గేట్లు బద్దలు కొట్టిన మనోజ్!)

నా బిడ్డ నన్ను కొట్టలేదు..మోహన్ బాబు

నా బిడ్డ మనోజ్ నన్ను కొట్టలేదని మోహన్ బాబు తెలిపారు. ఈ విషయంపై ఎవరూ కూడా రాద్ధాంతం చేయొద్దని మోహన్ బాబు విజ్ఞప్తి చేశారు. నా ఆస్తులు ఎవరికీ ఇవ్వాలనేది నా వ్యక్తిగత నిర్ణయమని అన్నారు. నువ్వు వచ్చి నీ బిడ్డను తీసుకెళ్లు.. లేదంటే ఇక్కడే క్షేమంగా ఉంటుందని వెల్లడించారు. దయచేసి మా ఇంటిలో జరిగిన గొడవపై అసత్యాలు ప్రచారం చేయవద్దని మీడియా మిత్రులు, పోలీసులను మోహన్ బాబు కోరారు.

నా ఆస్తులు నా ఇష్టం..

మోహన్ బాబు మాట్లాడుతూ..' మనోజ్ నువ్వు తప్పు చేయనని చెప్పి మళ్లీ ఇంట్లోకి వచ్చావ్. ప్రతిరోజు నువ్వు తాగుతున్న విధానం నీకు తెలుసు. ఇంతటితో గొడవకు ముగింపు పలుకుదాం. మోహన్ బాబు విశ్వవిద్యాలయం దేవాలయంతో సమానం. కాలేజీలో తప్పు జరిగితే ప్రభుత్వం చూసుకుంటుంది. కాలేజీని నెంబర్ వన్‌గా చేయాలని మీ అన్న ఎంతో కష్టపడుతున్నాడు. నాకు ఆస్తులేమీ వద్దని యాక్టింగ్‌లోకి వచ్చావ్. ఎంతో ఖర్చుతో విశ్వవిద్యాలయం 30 ఏళ్ల నుంచి నడుపుతున్నాం.  నా ఇంట్లోకి అడుగుపెట్టడానికి నీకు అధికారం లేదు. నన్ను ఎవరు మోసగాడు అనలేదు. నీకు జన్మనివ్వడమేనా నేను చేసిన పాపం. ఆస్తులు ముగ్గురికి సమానంగా రాయాలా లేదా అనేది నా ఇష్టం. మందు తాగొచ్చు. నేను ఒకటి రెండు పెగ్గులు తీసుకుంటా. కానీ మందు తాగి ఎవరిని కొట్టలేదని' అన్నారు.
 

Videos

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)