Breaking News

మనోజ్‌ రెండో పెళ్లి మోహన్‌ బాబుకు ఇష్టం లేదా? ఆయన ఏమన్నారంటే..

Published on Thu, 03/23/2023 - 13:17

యంగ్‌ హీరో మంచు మనోజ్‌ ఇటీవలె పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. స్నేహితురాలు భూమా మౌనిక రెడ్డితో మనోజ్‌ ఇటీవలె ఏడడుగులు వేసి కొత్త జీవితాన్ని ఆరంభించారు. కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇదిలా ఉంటే మనోజ్‌ పెళ్లి విషయంలో పలు వార్తలు ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొట్టాయి.

మోహన్‌ బాబుకు ఈ పెళ్లి ఇష్టం లేదని, వివాహానికి కూడా ఆయన హాజరు కారంటూ వార్తలు వినిపించాయి. కానీ వీటిని పటాపంచెలు చేస్తూ దగ్గరుండి మనోజ్‌ పెళ్లి జరిపించి వధూవరులను ఆశీర్వదించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మోహన్‌ బాబు మనోజ్‌ పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ''మనోజ్ నా దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు.

ఓసారి ఆలోచించమన్నాను. లేదు డాడీ నేను తీసుకున్న నిర్ణయం సరైనదేనని నేను భావిస్తున్నాను అన్నాడు. ఇంకేముంది చేసుకో.. బెస్ట్ ఆఫ్ లక్ అన్నాను. కాదని ఎందుకంటాను. ఎవరో ఏదో అనుకుంటారని పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ పోవాలి.  కుక్కలు మొరుగుతూ ఉంటాయి. ఎన్ని కుక్కలను నువ్వు ఆపుతావు?'' అంటూ మనోజ్‌ పెళ్లిపై విమర్శలు చేస్తున్న వారిని ఉద్దేశిస్తూ ఘాటుగా స్పందించారు. 

Videos

Vizianagaram: పలుచోట్ల బాంబు పేలుళ్లకు కుట్ర చేసినట్లు సిరాజ్ అంగీకారం

విగ్రహానికి టీడీపీ జెండాలు కట్టడంపై అవినాష్ రెడ్డి ఫైర్

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

Mahanadu: డ్వాక్రా సంఘాలకు బెదిరింపులు

ప్రభుత్వ స్కూళ్లలొ చదువులు అటకెక్కాయి: YS జగన్

మేడిగడ్డ బ్యారేజీపై NDSA ఇచ్చిన నివేదిక అంతా బూటకం: కేటీఆర్

సినిమాలతో ప్రభుత్వానికి ఏం సంబంధం అని గతంలో పవన్ కళ్యాణ్ అన్నారు

రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలి: YS జగన్

అల్లు అరవింద్ లీజు థియేటర్లన్నింటిలోనూ తనిఖీలు

కడపలోనే మహానాడు పెడతావా..! వడ్డీతో సహా చెల్లిస్తా...

Photos

+5

జబర్దస్త్ ఐశ్వర్య నూతన గృహప్రవేశ వేడుక (ఫొటోలు)

+5

కామాఖ్య ఆలయాన్ని సందర్శించిన హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ (ఫొటోలు)

+5

మహానాడులో చంద్రబాబు మహానటన (ఫొటోలు)

+5

పిఠాపురం : కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని మీరు ఎప్పుడైనా సంద‌ర్శించారా? (ఫొటోలు)

+5

NTR Jayanthi : ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద జూ. ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ నివాళి (చిత్రాలు)

+5

వోగ్ బ్యూటీ అవార్డ్స్ లో మెరిసిన సమంత, సారా టెండూల్కర్ (ఫొటోలు)

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)